Balapur Ganesh Laddu 2023: రూ.27 లక్షలు పలికిన బాలాపూర్‌ లడ్డూ.. దక్కించుకుంది ఎవరంటే..?

Balapur Ganesh Laddu 2023: రూ.27 లక్షలు పలికిన బాలాపూర్‌ లడ్డూ.. దక్కించుకుంది ఎవరంటే..?

Update: 2023-09-28 05:38 GMT

Balapur Ganesh Laddu 2023: రూ.27 లక్షలు పలికిన బాలాపూర్‌ లడ్డూ.. దక్కించుకుంది ఎవరంటే..?

Balapur Ganesh Laddu 2023: బాలాపూర్‌ లడ్డూ మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. తుర్కయాంజల్ మున్సిపాలిటీలోని పాటిగూడ గ్రామానికి చెందిన దాసరి దయానంద్‌రెడ్డి 27 లక్షల రూపాయాలకు సొంతం చేసుకున్నారు. ఇవాళ్టితో బాలాపూర్‌ లడ్డూ వేలంపాట 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఏయేడుకాయేడు ఎక్కువ ధర పలికే లడ్డూ.. ఈసారి ఎంతకు పోతుందో అనే ఆసక్తి నెలకొనగా.. రికార్డు స్థాయిలోనే పోయింది. గతేడాది 24 లక్షల రూపాయలకు వేలంలో పోయింది బాలాపూర్‌ లడ్డూ. బాలాపూర్ లడ్డూ వేలం పాటపై తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక దృష్టి ఉంటుంది. కరోనా సమయంలో తప్ప 28 ఏళ్ల పాటు ఈ వేలం పాట సాగింది. రికార్డు స్థాయిలో లడ్డూ ధర పలుకుతూ కొన్న వారి కొంగు బంగారంగా భావిస్తారు. ఈ వేలం పాటలో 20 మంది స్థానికులు సహా మొత్తం 36 మంది పోటీపడ్డారు.

Full View


Tags:    

Similar News