జల్సాల కోసం మగ శిశువును అమ్మేసిన తండ్రి
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోలేక తల్లిదండ్రులు పిల్లలను అమ్ముకునే ఎన్నో సంఘటనలు అక్కడక్కడ వెలుగులోకి వస్తునే వున్నాయి.
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోలేక తల్లిదండ్రులు పిల్లలను అమ్ముకునే ఎన్నో సంఘటనలు అక్కడక్కడ వెలుగులోకి వస్తునే వున్నాయి.సరిగ్గా ఇలాంటి సంఘటనే ఇప్పుడు వెలుగులోకి వొచ్చింది. కానీ ఈ తాగుడుకు బానిసైన ఓ తండ్రి జల్సాలు చేయడానికి డబ్బుల కోసం నెలరోజుల శిశువును రూ.22 వేలకు అమ్మేసి తల్లికి పుత్రశోకం మిగిల్చాడు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా గాజులరామారంలోని బతుకమ్మబండలో చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకివెళితే మహబూబాబాద్ జిల్లాకు చెందిన సరిత, మదన్‌సింగ్ దంపతులు 15 ఏళ్ల క్రితం నగరానికి వచ్చారు. వారు అడ్డా కూలీలు పనులు చేసుకుంటే మేడ్చల్ జిల్లా గాజులరామారం బతుకమ్మబండ ప్రాంతంలో ఉంటున్నారు. వీరికి ఇద్దుకు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరికి 6 ఏండ్లు ఉండగా నెల రోజుల క్రితం మరో బాలుడు జన్మించాడు. అడ్డా కూలిగా పనిచేస్తున్న మదన్‌సింగ్ మద్యానికి బానిసయ్యాడు. దీంతో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అది కాకుండా ఈ మధ్య కాలంలో లాక్‌డౌన్ విధించడంతో ఆ సమయంలో పని దొరకకపోవడంతో ఆర్థికంగా ఇంకా ఎక్కువ ఇబ్బందులపాలయ్యారు. సరిగ్గా అదే సమయంలో వారి ఇంటికి దగ్గర్లో ఉన్న మహేష్, యాదమ్మలు వీరి పరిస్థితి చూసారు. ఆ తరువాత వారికి తెలిసిన ఓ మహిళకు వారి ఇబ్బందులను వివరించారు. దీంతో సదరు మహిళ పెంచుకోవడానికి బాబు కావాలని మహేష్, యాదమ్మలు చెప్పింది. ఆ తరువాత మహేశ్, యాదమ్మలకు కొంత డబ్బు ఇచ్చి మదన్ సింగ్ కు కూడా రూ.22 వేలు చెల్లించింది. డబ్బులు తీసుకున్న మదన్ సింగ్ శనివారం రాత్రి తల్లి పక్కన నిద్రిస్తున్న శిశువును ఎత్తుకెళ్లి స్థానికంగా ఉండే ఓ మహిళక ఇచ్చేసాడు.
ఆదివారం ఉదయం సరిత ఏడుస్తూ ఉండటంతో చుట్టుపక్కల వాళ్లు ఏం జరిగిందని అడిగారు. దీంతో సరిత జరిగిన విషయం అంతా స్థానికులకు చెప్పారు. అది విన్న వారు వెంటనే పోలీసులకు పోలీసులకు, జిల్లా బాలరక్షక భవన్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ప్రతినిధులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు జీడిమెట్ల పోలీసుల సహాయంతో ఘటనాస్థలానికి చేరుకుని శిశువును రక్షించి అమీర్‌పేటలోని శిశువిహార్‌కు తరలించారు.