Babli Project: బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత
Babli Project: మహరాష్ర్టలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి.
Babli Project: మహరాష్ర్టలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి. తెలంగాణ-మహారాష్ర్ట నీటిపారుదల శాఖ అధికారుల సమక్షంలో బాబ్లీ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదలచేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇరు రాష్ర్టల జల సంఘం అధికారులు మొత్తం 14 గేట్లకు గాను మూడు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. నాలుగు నెలలపాటు ఎత్తి ఉంచనున్నారు. బాబ్లీ పూర్తి స్థాయి నీటి సామర్ధ్యం 1.96 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.75 టీఎంసీ నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తటంతో గోదావరిలోకి నీటి ప్రవాహం కొనసాగుతోంది. శ్రీరాంసాగర్ ఆయకట్టు కింద పంటలకు నీరు అందుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.