Holidays:ఉద్యోగులకు, విద్యార్థులకు గుడ్ న్యూస్.. వరుసగా 5 రోజులు హాలిడేస్ ...పండగ చేసుకోండి

Holidays: ఉద్యోగులకు, విద్యార్ధులు గుడ్ న్యూస్. ఆగస్టులో వరుసగా 5రోజులు సెలవులు వస్తున్నాయి. అందులో నాలుగు రోజులు సెలవులు ఉండగా..మధ్యలో ఓరోజు పర్సనల్ గా లీవ్ తీసుకుంటే మొత్తం 5 రోజులు లాంగ్ వీకెండ్ కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు 15వ తేదీ నుంచి ఆగస్టు 19వ తేదీ వరకు 5 రోజులు పాలు సెలవులు ఎలా రానున్నాయో తెలుసుకుందాం.

Update: 2024-08-06 04:16 GMT

Holidays:ఉద్యోగులకు, విద్యార్థులకు గుడ్ న్యూస్.. వరుసగా 5 రోజులు హాలిడేస్ ...పండగ చేసుకోండి

Holidays:ఆషాడం ముగిసి..శ్రావణం ప్రారంభం అయ్యింది. ఇక పండగల సీజన్ షురూ అయినట్లే. సాధారణంగా జూన్ 12 నుంచి పాఠశాలల అకాడమిక్ ఇయర్ ప్రారంభం అవుతుంది. ఆగస్టు నుంచి ఎక్కువగా సెలవులు వస్తాయి. కేవలం పాఠశాల, కాలేజీలకే కాదు..ఉద్యోగులకు కూడా భారీగానే సెలవులు వస్తుంటాయి. అయితే ఈసారి ఏకంగా 5రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఈ సెలవులు విద్యార్థులకే కాదు..ఉద్యోగులకు కూడా . అయితే మధ్య ఒకరోజు మనం సొంతంగా సెలవు తీసుకుంటే వరుసగా 5రోజుల పాటు లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేయవచ్చు. ఎలా అంటే

ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవం..ఈ రోజు స్కూల్లు, ఆఫీసులు, కాలేజీలకు సెలవు. కొన్ని ఆఫీసులకు, కాలేజీలకు ముందుగానే హాలీడే ప్రకటిస్తారు. ఆ రోజు సెలవు. తర్వాత రోజు ఆగస్టు 16వ తేదీ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం. ఆ రోజు కూడా చాలా వరకు బంద్ ఉంటుంది. దీంతో 15,16 తేదీల్లో రెండు రోజులు విద్యార్థులకు, ఉద్యోగులకు సెలవు వస్తుంది. అలాగే ఆగస్ఠఉ 18 ఆదివారం..ఆ రోజు సెలవు. 19వ తేదీన రాఖీ పౌర్ణమి సందర్బంగా ఆ రోజు కూడా పాఠశాలలు, కాలేజీలు, ఉద్యోగులకు సెలవు ఇవ్వనున్నారు. దీంతో మరో రెండు రోజులు సెలవులు వస్తున్నాయి.

అయితే 15,16,18,19 తేదీల్లో సెలవులు ఉన్నాయి. మధ్యలో ఆగస్టు 17వ తేదీ శనివారం మాత్రం వర్కింగ్ డే ఉంది. కొన్ని కంపెనీలు, స్కూళ్లకు ఆ రోజు కూడా సెలవు ఉంటుంది. 17వ తేదీని లీవ్ తీసుకుంటే వరుసగా 5రోజులు సెలవులు కలిసివస్తాయి. ఈ ఐదు రోజులు సెలవులు వస్తున్నాయి..కాబట్టి హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాలు, జలాశయాలు, లేదంటే ఏవైనా పుణ్యక్షేత్రాలకు ట్రిప్ వేసుకున్నట్లయితే సెలవులను ఎంజాయ్ చేయవచ్చు.

Tags:    

Similar News