మహిళకు సింగరేణి కార్మిక సంఘం నేత వేధింపులు

Update: 2021-02-25 10:55 GMT

మహిళకు సింగరేణి కార్మిక సంఘం నేత వేధింపులు

సమస్యల పరిష్కారం కోసం పోరాడాల్సిన కార్మికసంఘం నేతే ఓ కార్మికుడి కుటుంబానికి సమస్యగా మారాడు. సింగరేణి కాలరీస్ ఇల్లందు ఏరియా పరిధిలోని కోయగూడెం ఓసీలో పనిచేస్తున్న ఓ కార్మికుడి భార్యను తెలంగాణ బొగ్గుగని కార్మికసంఘం ఇల్లందు బ్రాంచ్ ఉపాధ్యక్షుడు గడ్డం వెంకటేశ్వర్లు కొద్దికాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. తరచూ ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. దీంతో వేధింపులు తాళలేక బాధితురాలు తెలివిగా అతడికే ఫోన్ చేసి వాయిస్ రికార్డ్ చేసింది. ఆధారాలతో సహా ఇల్లందు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు విషయం నిర్థారణ చేసుకున్నా నిందితుడిపై కేసు నమోదు చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బాధితురాలి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు విషయం నిర్థారణ చేసుకున్నా నిందితుడిపై కేసు నమోదు చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీలోని బడా నేతలు కలుగజేసుకోవడంతో పెద్ద మనుషులతో గొడవలెందుకంటూ సీఐ బాధితురాలికి తెలిపినట్లు తెలుస్తోంది. అయితే ఇకపై వేధింపులకు పాల్పడబోనని నిందితుడు వెంకటేశ్వర్లు లిఖితపూర్వకంగా రాసివ్వడంతో విషయం సద్దుమణిగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే వేధింపులు, దాడులపై కొందరు మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదులిస్తున్నప్పటికీ పోలీసు స్టేషన్లలో సరైన న్యాయం జరగడం లేదని మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేయకుండా పోలీస్ స్టేషన్లో పంచాయతీ పెట్టడమేంటంటూ ప్రశ్నిస్తున్నాయి.

Full View


Tags:    

Similar News