‌Hanamkonda: హన్మకొండ జిల్లా కేంద్రంలో సెల్‌షాపు యజమానికి నిప్పు

‌Hanamkonda: రాజుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన గణేష్, కావ్య * చిట్టీ డబ్బులు అడిగినందుకు ఆగ్రహంతో

Update: 2021-09-04 06:30 GMT

Representational Image

Hanamkonda: తనకు రావాల్సిన చిట్టీ డబ్బులు అడిగినందుకు ఓ యువకుడిపై చిట్​ఫండ్ కంపెనీ ఏజెంట్, అతని భార్య కలిసి పెట్రోల్​పోసి నిప్పంటించారు. హనుమకొండ ఈ ఘటన కలకలం సృష్టించింది. బాలసముద్రానికి చెందిన యువకుడు హనుమకొండ పీఎస్ సమీపంలోని కాంగ్రెస్​భవన్​దగ్గర సెల్ ఫోన్​షాపు నిర్వహిస్తున్నాడు. వచ్చే ఆదాయంలో ఎంతోకొంత సేవ్​ చేసుకునేందుకు నక్కలగుట్ట ప్రాంతంలోని అచల చిట్​ఫండ్స్​ ప్రైవేట్​లిమిటెడ్ ​కంపెనీలో ఏజెంట్ గణేశ్ ద్వారా 5 లక్షల చిట్టీ వేశాడు. జనవరిలో చిట్టీ టర్మ్​కంప్లీట్​కాగా తనకు రావాల్సిన డబ్బు కోసం రాజు పలుసార్లు చిట్​ఫండ్ కంపెనీకి వెళ్లి అడిగాడు. అక్కడ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో చిట్టీ డబ్బులు కట్టించిన ఏజెంట్​గణేశ్​ను నిలదీశాడు. గణేశ్, అతని భార్య కావ్యతో గొడవపడ్డాడు.

దీంతో గణేశ్​ దంపతులు రాజు షాపు తగలబెట్టేందుకు ప్లాన్​వేశారు. గణేశ్​, కావ్య దంపతులు బాటిల్​లో పెట్రోల్​తీసుకుని రాజు సెల్​ఫోన్​షాపు దగ్గరికి వెళ్లారు. షాపులో ఉన్న వస్తువులతో పాటు పక్కనే ఉన్న రాజు భార్య పై పెట్రోల్​ పోసి నిప్పంటించారు. అక్కడే ఉన్న రాజు సిరిని రక్షించి బయటకు తీసుకురాగా.. కావ్య మరోసారి రాజుపై పెట్రోల్ గుప్పించింది. దీంతో ఆయన ఒళ్లంతా మంటలు వ్యాపించాయి. పక్కనే ఉన్న పాన్​షాపు యజమాని రంగయ్య, ఇతర షాపుల వాళ్లు గమనించి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. రాజు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News