హైదరాబాద్ అల్వాల్ దారుణం
హైదరాబాద్ అల్వాల్‌లో దారుణం జరిగింది. అల్వాల్ ప్రాంతానికి చెందిన ఒక వ్యాపారి కిరాతకంగా వ్యవహరించారు. తన వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కోపంతో ఒక యువకుడిని దారుణంగా హత్య చేశాడు.
హైదరాబాద్ అల్వాల్‌లో దారుణం జరిగింది. అల్వాల్ ప్రాంతానికి చెందిన ఒక వ్యాపారి కిరాతకంగా వ్యవహరించారు. తన వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కోపంతో ఒక యువకుడిని దారుణంగా హత్య చేశాడు. తనకు అడ్డుగా ఉన్న శ్రీకాంత్‌రెడ్డిని బంధించి దారుణంగా హత్య చేశాడు. ఐదు రోజుల క్రితం జరిగిన ఈ దారుణం.. ఇటీవల వెలుగులోకి రావడంతో పోలీసులు కనకరాజును అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఇప్పుడు అల్వాల్ సంచలనంగా మారింది..
కనకరాజు కొన్నాళ్లుగా ఒక యువతితో వివాహేతర సంబంధం కొనసాగుతున్నాడు. అయితే.. కనకరాజు వివాహేతర సంబంధం పెట్టుకున్న యువతితో, శ్రీకాంత్ రెడ్డి మరో సంబంధం పెట్టుకున్నాడు. దాంతో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. యువతిని వదిలివెళ్లలంటూ శ్రీకాంత్‌కు కనకరాజు బెదిరించాడు. అంతేకాదు.. కనకరాజు వేధింపులు ఎక్కువ కావడంతో ఆరు నెలల క్రితం యువతిని తీసుకుని శ్రీకాంత్ రెడ్డి వెళ్లిపోయారు. దాంతో కనకరాజులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇద్దరి కోసం వెతికి.. హైదరాబాద్‌కు తీసుకొచ్చాడు.
హైదరాబాద్‌కు తీసుకొచ్చిన కొన్నాళ్లకు కనకరాజు వారిని జవహర్ నగర్‌లోని ఒక ఇంట్లో బంధించాడు. పదిరోజుల పాటు శ్రీకాంత్‌ను చిత్రహింసలకు గురి చేశాడు. ఐదు రోజుల క్రితం శ్రీకాంత్‌ను చంపేసి.. స్మశానంలో పాతిపెట్టాడు కనకరాజు. మద్యం మత్తులో శ్రీకాంత్‌ను హత్య చేశానంటూ మిత్రులతో కనకరాజు చెప్పడంతో ఈ విషయం బయటకు పొక్కింది. సమాచారం అందుకున్న రాచకొండ ఎస్వోటీ పోలీసులు కనకరాజును అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సమక్షంలో శ్రీకాంత్ మృతదేహాన్ని వెలికి తీసి.. పోస్ట్‌మార్టమ్ నిర్వహిస్తున్నారు.