యూటీపై క్లారిటీ..దుమారం ఆగేనా?

Update: 2021-02-14 11:22 GMT

యూటీపై క్లారిటీ..దుమారం ఆగేనా?

మోదీ ప్రభుత్వం భవిష్యత్తులో హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే ప్రమాదం ఉందని అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. చెన్నై, బెంగళూరు, ముంబయి, అహ్మదాబాద్‌, లఖ్‌నవూలనూ యూటీలుగా మార్చేస్తారని తెలిపారు. ఇదే బీజేపీ విధానమని ఆరోపించారు. ఇప్పుడు కరతాళ ధ్వనులు చేసే సెక్యులర్‌ పార్టీలు ఆ ప్రాంతాలను యూటీలుగా మార్చినప్పుడు గగ్గోలు పెట్టడం ఖాయమన్నారు. ప్రభుత్వానికి మద్దతిచ్చే పార్టీలు అప్పటి పరిణామాలకు సిద్ధంగా ఉండాలని ఒవైసీ హెచ్చరించారు.

ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ స్పందించారు. అసదుద్దీన్‌కు ఏ సమయంలో ఏం మాట్లాడాలో తెలియదని బుద్ది లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. ఎంఐఎం పార్టీ జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్‌ పదవులు కోల్పోవడంతో అసదుద్దీన్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దెవా చేశారు. ఒవైసీ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోవాల్సిన పనిలేదన్నారు రాజాసింగ్.

ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లోక్ సభలో చేసిన వ్యాఖ్యలపై కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో వచ్చే రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ గెలవడం ఖాయమన్నారు. హైదరాబాద్ ఇతర నగరాలను యూటీ చేస్తానని కామెంట్ చేశారని అంతలోనే సమాధానం ఇచ్చేలోపు బయటకు వెళ్లారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ ను కాదు దేశంలో ఏ నగరాన్ని యూటీ చేయామని స్పష్టం చేశారు. అన్ని నగరాలను అభివృద్ధి చేస్తామన్నారు. 

Full View


Tags:    

Similar News