Balineni Srinivas Reddy Escort Vehicle Accident : ఏపీ మంత్రి బాలినేని ఎస్కార్ట్ వాహనం బోల్తా.. ఒకరు మృతి
Balineni Srinivas Reddy Escort Vehicle Accident : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఎస్కార్ట్ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ పాపయ్య చనిపోయారు. మరో ముగ్గురు కానిస్టేబుల్లకు గాయాలయ్యాయి.. క్షతగాత్రుల్ని వెంటనే దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. మంత్రి గచ్చిబౌలి ప్రాంతం నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాన్వాయ్‌లోని కారు టైరు పేలడంతో అదుపుతప్పి వాహనం బోల్తాపడింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.