Hyderabad: బోర్డు తిప్పేసిన మరో సాఫ్ట్ వేర్ కంపెనీ

Hyderabad: ఫన్‌ లాబ్‌ టెక్నాలజీస్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఘరానా మోసం

Update: 2021-02-27 05:29 GMT

ఫన్ ల్యాబ్ టెక్నాలజీ  సాఫ్ట్వేర్ కంపెనీ (ఫైల్ ఇమేజ్)

Hyderabad: అమాయకులే టార్గెట్.. నిరుద్యోగులే లక్ష్యంగా ఫేక్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. ఉద్యోగం ఆశాచూపి నిరుద్యోగుల దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేసే కంపెనీలు చాలానే ఉన్నాయి. అలాంటి కంపెనీ మరొకటి వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లో మరో సాఫ్ట్‌వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. డబ్బులు తీసుకుని ఉద్యోగం ఇస్తానని చెప్పి నిరుద్యోగులను బోల్తా కొట్టించింది.

హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఫన్ లాబ్ టెక్నాలజీస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ బీటెక్ ఫ్రెషర్‌కు ఉద్యోగాలిస్తామంటూ వందలాది మంది నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశారు. ఒక్కొక్కరి నుంచి 20వేల నుంచి 40 వేల వరకు వసూలు చేసినట్టు బాధితులు ఆరోపించారు. అపాయింట్‌మెంట్‌ లెటర్స్ ఇచ్చిన నెల రోజుల్లోనే సంస్థ చేతులెత్తేసింది. సంస్థ యాజమాని పరారీలో ఉన్నారు. గతంలో కూడా ఈ సంస్థ ఇలాగే చేసినట్టు.. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దాంతో బాధితులు లేబర్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. 

Full View


Tags:    

Similar News