సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి.. మునుగోడు సభలో కేసీఆర్‌‌కు షా ప్రశ్నల వర్షం

Amit Shah: సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామని గతంలో కేసీఆర్‌ హామీ ఇచ్చి మాట తప్పారని అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.

Update: 2022-08-21 13:39 GMT

సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి.. మునుగోడు సభలో కేసీఆర్‌‌కు షా ప్రశ్నల వర్షం

Amit Shah: సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామని గతంలో కేసీఆర్‌ హామీ ఇచ్చి మాట తప్పారని అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. మజ్లిస్‌కు భయపడే తెలంగాణ విమోచన దినోత్సవం జరపడంలేదని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకుందామన్నారు అమిత్‌షా. మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ.. 'మునుగోడు సమరభేరి' పేరిట నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే కేసీఆర్‌ అవినీతి సర్కారు మాయం అవుతుందన్నారు. కేసీఆర్‌ సర్కార్‌ అబద్ధాలకోరు ప్రభుత్వం అంటూ ఆయన దుయ్యబట్టారు.

తెలంగాణ రాష్ట్రంలో కిసాన్‌ బీమా యోజన పథకాన్ని అమలు చేయడం లేదని, తాము అధికారంలోకి వస్తే అన్ని పథకాలను రాష్ట్రంలో ప్రవేశపెడతామన్నారు. పేదవారికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కేసీఆర్‌ ఇచ్చారా?. నిరుద్యోగులు రూ.3వేలు ఇస్తామని కేసీఆర్‌ మాట తప్పారు. ప్రతి జిల్లాలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామన్నారు. నల్లగొండ జిల్లాలో సూపర్‌ స్పెషాలిటీ ప్రారంభం అయ్యిందా అంటూ అమిత్‌ షా ప్రశ్నించారు.

దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్‌ మాట నిలబెట్టుకున్నారా? మరోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేస్తారు తప్ప.. దళితుడిని ముఖ్యమంత్రి చేయరు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు దళితబంధు పేరుతో రూ.10లక్షలు ఇస్తామన్నారు.. ఎన్ని కుటుంబాలకు ఇచ్చారు? ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తామని వాగ్ధానం చేశారు.. ఇచ్చారా? గిరిజనులకు భూములు ఇస్తామన్నారు.. ఇవ్వలేదు. యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.. కానీ, కేసీఆర్‌ కుటుంబలోని వారికి మాత్రమే ఉపాధి కల్పించారు. రైతులను కేసీఆర్‌ తీవ్రంగా మోసం చేస్తున్నారని అమిత్‌ షా విమర్శించారు.

Full View


Tags:    

Similar News