BJP Manifesto: బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా

BJP Manifesto: అన్ని పంటలకు పంట బీమాను పొందుపర్చిన బీజేపీ

Update: 2023-11-18 13:49 GMT

BJP Manifesto: బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా

BJP Manifesto: తెలంగాణ బీజేపీ మేనిఫెస్టో విడులైంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేతుల మీదుగా 10 అంశాలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేశారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణ పేరుతో మేనిఫెస్టోను ప్రకటించారు. ప్రస్తుతం 10 అంశాలను పొందుపర్చారు. ధరణి స్థానంలో 'మీభూమి' యాప్, కేంద్ర పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ, గల్ఫ్ బాధితుల కోసం నోడల్ ఏజెన్సీ, రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై విచారణకు కమిషన్, 4 శాతం ముస్లిం రిజర్వేషన్ ఎత్తివేత, తెలంగాణలో ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామని.. అన్ని పంటలకు పంట బీమాను తమ మేనిఫెస్టోలో పొందుపర్చించింది బీజేపీ.

10 అంశాలతో బీజేపీ మేనిఫెస్టో

1. ప్రజలందరికీ సుపరిపాలన.. సమర్థవంతమైన పాలనపై దృష్టి

2. వెనుకబడిన వర్గాల సాధికారిత.. అందరికీ సమాన చట్టం వర్తింపు

3. కూడు, గూడు, ఆహార, నివాస భద్రత

4. రైతే రాజు.. అన్నదాతకు అందలం

5. నారీ శక్తి.. మహిళల నేతృత్వంలో అభివృద్ధి

6. యువశక్తి.. ఉపాధి

7. విద్యశ్రీ.. నాణ్యమైన విద్య

8. వైద్యశ్రీ.. నాణ్యమైన వైద్య సంరక్షణ

9. సంపూర్ణ వికాసం.. పరిశ్రమలు, మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలు

10. వారసత్వం, సంస్కృతి & చరిత్ర

Tags:    

Similar News