Telangana: రాహుల్ బాటలో అమిత్‌షా
Telangana: తెలంగాణలో రెండు జాతీయ పార్టీలు ఒకటే బాట ప్రకారం నడుస్తున్నాయా అన్న చర్చను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
Telangana: తెలంగాణలో రెండు జాతీయ పార్టీలు ఒకటే బాట ప్రకారం నడుస్తున్నాయా అన్న చర్చను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో ఉన్న విభేదాలతో అధ్యక్షులకు అధినాయకులు బాసటగా ఉన్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరంగల్ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి దన్నుగా రాహుల్ నిలవడం సీనియర్లను నేరుగా సభా వేదిక నుంచే కౌంటర్లివ్వడంతో రేవంత్ వ్యతిరేక వర్గంలో గుబులు రేగింది.
తుక్కుగూడా బీజేపీ సభ ద్వారా అమిత్ షా సైతం ఇదే తరహాలో ఫుల్ క్లారిటీ ఇచ్చారు. బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను ఎత్తుకున్న అమిత్ షా కేసీఆర్ ప్రభుత్వం కూల్చడానికి సంజయ్ చాలన్నారు. షా వ్యాఖ్యలతో సంజయ్ వర్గంలో ఒక్కసారిగా ఊపొచ్చింది. అదే సమయంలో షా సభ తర్వాత సంజయ్ వ్యతిరేక వర్గంలో అలజడి నెలకొంది. బండికి త్వరలోనే ప్రాధాన్యత తగ్గిస్తారంటూ కొందరు ప్రచారం చేస్తున్న తరుణంలో షా వ్యాఖ్యలతో అసమ్మతినేతలకు చెక్ పడిందన్న వర్షన్ విన్పిస్తోంది.