Gandhi Hospital: గాంధీ హాస్పిటల్ ముందు అంబులెన్స్‌ల క్యూ
Gandhi Hospital: గాంధీకి వస్తోన్న రోజుకు 70 నుంచి 80 మంది బాధితులు
Ambulance: గాంధీలో కొవిడ్, నాన్ కోవిడ్ రోగులకు వేర్వేరుగా చికిత్సలు అందిస్తున్నారు. ఎమర్జెన్సీ దగ్గర ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంలో పేర్లు నమోదు చేసుకుని కొవిడ్ రోగులకు పరీక్షిస్తున్నారు.. ఆక్సిమీటర్ పెట్టి ఆక్సిజన్ శాచ్యురేషన్ గమనిస్తున్నారు. అవసరమైన వారిని ఐసీయూ, ఇతర వార్డులకు తరలిస్తున్నారు. ఇలా ఒక్కొరోగిని పరిక్షించేందుకు దాదాపు 30 నిమిషాల సమయం పడుతుంది.. తమ వంతు వచ్చే సరికి కొంతమంది బాధితుల పరిస్థితి విషమంగా మారుతోంది.