Ambulance Services: అంబులెన్స్ సర్వీసుల కోసం ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్
Ambulance Services: హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అంబులెన్స్ అవసరమైన వారు 9490617440, లేదా 9490617431 నంబర్లను సంప్రదించవచ్చు
Ambulance Services: కరోనా వేళ అంబులెన్స్‌ల ఛార్జీలు మోత మోగుతున్నాయి. అయితే సామాన్యులకు ఫ్రీగా 12 అంబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం 8 అంబులెన్స్ లను ప్రారంభించారు. వీటిని పోలీస్ కమిషనర్ ఆడిషినల్ డీజీపీ సజ్జనార్ ప్రారంభించారు. మరో రెండు రోజుల్లో మిగితా నాలుగు అంబులెన్స్‌లు అందుబాటులోకి రానున్నాయి.
సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అంబులెన్స్ అవసరమైన వారు 9490617440, లేదా 9490617431 నంబర్లను సంప్రదించాలన్నారు. కోవిడ్ కంట్రోల్ రూమ్‌ను ఇన్‌స్పెక్టర్ ర్యాంకు అధికారి పర్యవేక్షించనున్నారు. అయితే ఎవరైనా అంబులెన్స్ వాహనదారులు అధికంగా డబ్బు డిమాండ్ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలన్నారు సీపీ సజ్జనార్.
ఈ అంబులెన్స్‌లను ప్రైవేట్ అంబులెన్స్‌లకు ధీటుగా ఏర్పాటు చేశారు. ఆక్సిజన్, అత్యవసర మందుల కోసం ప్రత్యేక విభాగాన్ని తయారు చేశారు. 24 గంటలపాటు అంబులెన్స్ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని నిర్వాహకులు చెబుతున్నారు. ఆరోగ్యం క్షీణించిన కరోనా పేషెంట్లను వెంటనే ఆసుపత్రులకు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో