Ramadugu: వలస కూలీలకు నిత్యవసర సరుకులను పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు
రామడుగు మండలంలోని పారిశుద్ధ్య కార్మికులకు, వలస కూలీలకు టీడీపీ నాయకులు నిత్యావసర సరుకులను పంపిణీ చేసారు.
రామడుగు మండలంలోని పారిశుద్ధ్య కార్మికులకు, వలస కూలీలకు టీడీపీ నాయకులు నిత్యావసర సరుకులను పంపిణీ చేసారు. రామడుగు గ్రామానికి చెందిన పారిశుద్ధ్య కార్మికులకు దేశరజపల్లి గ్రామానికి చెందిన వలస కూలీలకు నిత్యవసర సరుకులను, పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి రామడుగు ఎస్సై అనూష పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల్ పార్టీ అధ్యక్షుడు అమీరిశెట్టి సుధాకర్, పార్లమెంట్ టీడీపీ మీడియా సెల్ అధ్యక్షుడు బిరెడ్డి కరుణాకర్ రెడ్డి, జిల్లా నాయకులు అనుపురం వెంకటేష్ గౌడ్, జువాజి కాంతయ్య, సంతోష్, పురేళ్ల మనోజ్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.