మరోసారి మంత్రి గంగుల కమలాకర్‌ సంచలన వ్యాఖ్యలు

Update: 2021-02-17 06:56 GMT

గంగుల కమలాకర్ అండ్ షర్మిల (ఫోటో ది హన్స్ ఇండియా)

మంత్రి గంగుల కమలాకర్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల పార్టీ నిర్ణయంపై విమర్శలు గుప్పించారు. ఆంధ్ర పెత్తనం వస్తే మళ్లీ కష్టాలు తప్పవని జగనన్న బాణం అంటూ షర్మిల వస్తుంది తర్వాత జగన్‌ ఆ తర్వాత చంద్రబాబు వస్తారంటూ కామెంట్‌ చేశారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా చెబుతున్నా కేసీఆర్‌ను కాపాడుకోవాలి లేకపోతే ఇబ్బందులు తప్పవంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు మంత్రి గంగుల కమలాకర్‌. తెలంగాణలో మళ్లీ కొట్లాటలు, విధ్వంసాలు, ఫ్యాక్షన్‌ తప్పవని అన్నా చెల్లెల్ల గొడవలు ఉంటే మీరు మీరు చూసుకోండి మాపై ఎందుకు రుద్దడం అంటూ వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News