Grand Hotel: బిర్యానీ బాగోలేదని చెప్పిన కస్టమర్లు.. కర్రలతో దాడి చేసిన వెయిటర్లు

Grand Hotel: లేదంటే హోటల్‌ను తగలబెడతానని వార్నింగ్‌

Update: 2024-01-01 13:34 GMT

Grand Hotel: బిర్యానీ బాగోలేదని చెప్పిన కస్టమర్లు.. కర్రలతో దాడి చేసిన వెయిటర్లు

Grand Hotel: బిర్యానీ విషయంలో కస్టమర్లపై హోటల్‌ సిబ్బంది దాడి చేసింది. ఈ ఘటన అబిడ్స్ పోస్టాఫీస్ వెనుక ఉన్న గ్రాండ్ హోటల్‌లో జరిగింది. ఆదివారం అర్ధరాత్రి బిర్యానీ తినేందుకు వెళ్లిన కస్టమర్లు టేస్ట్ బాగోలేదనిచెప్పారు. దీంతో మొదలైన వివాదం.. ఘర్షణకు దారితీసింది. వెంటనే హోటల్ సిబ్బంది కర్రలతో కస్టమర్లపై దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వెంటనే పోలీసులతో మాట్లాడారు. వెయిటర్లు, యజమానిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరారు. లేదంటే హోటల్‌ను తగలబెడతామని హెచ్చరించారు.

Tags:    

Similar News