Nagarkurnool: నరహంతుకుడు.. తాంత్రిక పూజలతో హత్యచేసిన మాంత్రికుడు
Nagarkurnool: హైదరాబాద్‌లో జరిగిన హత్యతో కదిలిన డొంక
Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లాలో నరహంతుకుకి గాతుకాలు ఒక్కక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తాంత్రిక పూజలతో నమ్మించి..ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20కి పైగా హత్యలు చేశాడో నరహంతకుడు.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన సత్యం యాదవ్ అనే వ్యక్తి తాంత్రిక పూజలతో ప్రజల అమాయకత్వాన్ని, అవసరాలను ఆసరాగా చేసుకుని సంఘంలో పెద్దమనిషిగా చలామణి అయ్యాడు. ఆ ఆసరాతోనే అటు పోలీసులు..ఇటు రాజకీయ నాయకులతో పరిచయాలు పెంచుకుని ఓ పార్టీలో నాయకుడిగా మారాడు. ఇక తనకు ఎదురు ఉండదని భావించి..అరాచకాలు మొదలు పెట్టాడు. అయితే, హైదరాబాద్ లో జరిగిన ఓ హత్యలో ఇతడి ప్రమేయం ఉందని గుర్తించిన పోలీసులు.. ఈ దిశగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే నాగర్ కర్నూలు జిల్లాలోనే కాకుండా, హైదరాబాద్, ఏపీలోనూ పలు దురాగతాలకు పాల్పడినట్లు వారి దృష్టికి వచ్చింది. అతడు చేసిన దురాగతాలలో కొన్నింటిని ఇప్పటికే గుర్తించినట్లు తెలుస్తొంది.
తాంత్రికుడు సత్యం యాదవ్ వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో 2020 ఆగస్టు 14న గుప్తనిధులు తవ్వకం కోసం ఒకే ఇంట్లో నలుగురిని హతమార్చిన సంఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్నట్టు తెలుస్తుంది. నాగర్ కర్నూలు జిల్లా గన్నేరుల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కుమారుడికి బ్యాంకులో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి..లక్షల విలువైన ప్లాటును తన పేరిట రాయించుకున్నాడు. అయితే, ఉద్యోగం ఇప్పించలేదని బాధితుడు గొడవ చేయడంతో అతడిని హతమార్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులోనూ సత్యం యాదవ్ ప్రధాన నిందితుడిగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
అనంతపురం జిల్లాలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటనలోనూ... హైదరాబాద్ చెందిన ఓ వ్యక్తి మిస్సింగ్ కేసులోనూ సత్యం యాదవ్ హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. పోలీసులు అధికారికంగా ప్రకటించనప్పటికీ.. ఈ సంఘటనలు మచ్చుకు కొన్ని మాత్ర మేనని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. నిజానికి ఇతడిపై రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్టే స్టేషన్లలో 12 నుంచి 16 కేసులు ఉన్నాయని...20 మందికి పైగా ఇతని చేతిలో హత్యకు గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు నిందుతుడిని రేపు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.