అందరూ చూస్తుండగానే హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడ పరిధిలోని ఏఎస్ రావు నగర్‌లోని ప్రధాన రహదారి ఒక్కసారిగా కుంగిపోయింది. వాహనదారులు, ట్రాఫిక్ పోలీసులు అందరూ చూస్తుండగానే రోడ్డంతా కుంగిపోయి క్రమక్రమంగా పెద్ద గుంత ఏర్పడింది. మెళ్లిగా కుంగుతున్న రోడ్డును గమనించిన ట్రాఫిక్ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. గుంతచుట్టూ పెద్ద బారీకేడ్లు ఏర్పాటు చేశారు. దాని దరిదాపుల్లో వాహనదారులు ఎవరూ రాకపోకలు జరపకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ఈ సమాచారం అందుకున్న కుషాయిగూడ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.
ట్రాఫిక్ పోలీసులు స్పందించి వెంటనే జాగ్రత్తలు తీసుకోవడంతో ఎవరికీ ఏలాంటి ప్రమాదం సంభవించలేదు. ఇక ఆ మార్గంలోని ట్రాఫిక్ ను వెంటనే మరో వైపునకు మళ్లించారు. అనంతరం జీహెచ్ఎంసీ అధికారులకు పోలీసులు సమాచారం అందించారు. ఈ సమాచారంతో జీహెచ్ఎంసీ అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. వారు గొయ్యిని పరిశీలించి రోడ్డుపై గొయ్యి పడడానిక గల కారణాలు ఏంటి అన్న కారణాలను విశ్లేషిస్తున్నారు. త్వరలోనే గొయ్యిని పూడ్చుతామని, ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా చస్తామని జీహెచ్ఎంసీ సిబ్బంది తెలిపారు.