Hyderabad: ప్రైవేట్ ఫైనాన్షియర్ చేతిలో మాజీ హోంగార్డ్ మృతి..!

Hyderabad: రిజ్వాన్‌ మృతి చెందడంతో పోలీసులకు బాధితుల ఫిర్యాదు

Update: 2023-09-18 14:02 GMT

Hyderabad: ప్రైవేట్ ఫైనాన్షియర్ చేతిలో మాజీ హోంగార్డ్ మృతి..!

Hyderabad: హైదరాబాద్‌లో ఓ మాజీ హోంగార్డ్‌ మృతి చెందాడు. ఐఎస్‌ సదన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మాజీ హోంగార్డ్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ను.. 2 రోజుల క్రితం కిడ్నాప్‌ చేసి చిత్రహింసలు పెట్టాడు ఫైనాన్షియర్స్‌. తీవ్రకొట్టడంతో.. ఆ దెబ్బలకు పరిస్థితి విషమించి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మాజీ హోంగార్డ్‌ రిజ్వాన్‌ మృతి చెందాడు. ఐఎస్ సదన్ భానునగర్ కు చెందిన మహ్మద్ రిజ్వాన్ ఓ ప్రయివేట్ ఫైనాన్షియర్ వద్ద లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఇటీవల కాలంలో అసలు, వడ్డీ కలిపి అప్పు తీర్చాడు. కానీ చక్రవడ్డి ఇవ్వలేదని రెండు రోజుల క్రితం నాంపల్లికి చెందిన ఓ ముఠా ఐఎస్ సదన్ నుంచి కిడ్నాప్ చేసి నాంపల్లిలోని ఓ భవనంలో రెండు రోజుల పాటు చిత్ర హింసలకు గురి చేశారు.

విషయం తెలుసుకున్న బాధితుడి తండ్రి 2లక్షలు చెల్లించి కొడుకును విడిపించుకున్నాడు. పోలీసులకు చెబితే చంపేస్తామంటూ బెదిరించడంతో ఫిర్యాదు చేయలేకపోయారు. నిందితులు కొట్టిన దెబ్బలకు తట్టుకోలేకపోవడంతో బాధితుడిని ఇంటికి తీసుకొచ్చిన తరువాత ఒవైసీ హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ మరణించడంతో బాధితుణ్ణి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News