కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ పై కేసు నమోదు
Addanki Dayakar: హిందూ దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు
Addanki Dayakar: కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ పై నిర్మల్ లో కేసు నమోదయింది. ఈనెల 5న జిల్లా నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభలో అద్దంకి దయాకర్ హిందూ దేవతలు రాముడు, సీతపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.