TS Corona Cases: ప్రమాద ఘంటికలు..24గంటల్లో 7,994 కొత్త కేసులు
TS Corona Cases: తెలంగాణలో కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తుంది.
TS Corona Cases: తెలంగాణలో కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. గడిచిన24గంటల వ్యవధిలో 80,181 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 7,994 కొత్త కేసులు వెలుగు చూశాయి. అలాగే, ఈ మహమ్మారి బారిన పడి 58 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 4,009 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 76వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ మహమ్మరి బారిన పడి 2208మంది మరణించారు.
రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1,28,28,763 శాంపిల్స్ పరీక్షించగా.. 4,27,960 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 3,49,692మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. ప్రస్తుతం 76,060 క్రియాశీల కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 81.71శాతంగా ఉండగా.. మరణాల రేటు 0.51శాతంగా ఉంది.
జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 1630 కొత్త కేసులు వెలుగు చూడగా.. ఆ తర్వాత మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 615, రంగారెడ్డి 558 కేసులు వచ్చాయి. అలాగే, 200లకు పైబడిన కొత్త కేసులను పరిశీలిస్తే.. నల్గొండ 424, సంగారెడ్డి 337, నిజామాబాద్ 301, సిద్దిపేట 269, మహబూబ్‌నగర్ 263, జగిత్యాల్ 238, ఖమ్మం 213, సూర్యాపేట 207, వికారాబాద్ 207, నాగర్‌కర్నూలు 206, మంచిర్యాల్ 201 చొప్పున నమోదయ్యాయి. రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోవడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. జీహెచ్‌ఎంసీలో కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ఈనేపథ్యంలో ఇతర రాష్ట్రల వారు తమ ప్రాంతాలకు తిరిగి వెళ్తున్నారు.