తెలంగాణలో కొత్తగా 609 కరోనా కేసులు

Update: 2020-12-03 05:36 GMT

తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 609 కరోనా కేసులు నమోదు కాగా.. ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 2,71,492కు చేరింది. 1,465 మంది మరణించారు. కరోనాబారి నుంచి నిన్న 873 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,61,028కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 8,999 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 6,922 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు తెలంగాణలో నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 56,05,306కి చేరింది.



 


Tags:    

Similar News