తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 502 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని రిలీజ్ చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,57,876కి చేరింది. తాజాగా 1,539 మంది మహమ్మారి నుంచి కోలుకోగా ఇప్పటి వరకు 2,42,084 మంది కరోనాను జయించినట్లు ప్రభుత్వం బులిటెన్‌లో పేర్కొంది. తాజాగా కరోనా కారణంగా ముగ్గురు మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 1,407కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 14,385 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది. 11,948 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 17,296 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 48,91,721కి చేరింది.