Musi Project: మూసీ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద.. 5 గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి దిగువకు నీరు విడుదల
Musi Project: ఇన్‌ఫ్లో 5,849 క్యూసెక్కులు.. ఔట్‌ఫ్లో 7,759 క్యూసెక్కులు
Musi Project: నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం మూసీ ప్రాజెక్ట్‌కు భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా మూసీ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో అధికారులు ప్రాజెక్టు 5 గేట్లను రెండు ఫీట్ల మేర పైకెత్తి 6వేల550 క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో లోతట్టు గ్రామ ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇన్‌ఫ్లో 4వేల481 క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ఫ్లో 6వేల550 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. మూసీ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 645 అడుగులు కాగా.. ప్రస్తుత సామర్థ్యం 642.20 అడుగులుగా ఉంది.