తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 491 కరోనా కేసులు నమోదు కాగా.. ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 2,78,599కు చేరింది. 1,499 మంది మరణించారు. కరోనాబారి నుంచి నిన్న 596 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,69,828కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 7,272 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 5,169 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 48,005 నమూనాలను పరీక్షించగా, ఇప్పటి వరకు తెలంగాణలో నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 62,05,688కి చేరింది.