TS News: తెలంగాణలో అదనంగా మరో 450 పోలింగ్ కేంద్రాలు

TS News: లోక్‌సభ ఎన్నికలకు 35,806 పోలింగ్ కేంద్రాలు

Update: 2024-04-11 09:59 GMT

TS News: తెలంగాణలో అదనంగా మరో 450 పోలింగ్ కేంద్రాలు

TS News: లోక్‌సభ ఎన్నికల కోసం రాష్ట్రంలో అదనంగా మరో 450 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మూడు లక్షల మంది ఓటర్లు పెరిగిన నేపథ్యంలో అదనపు పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అప్పుడు 35వేల 356 కేంద్రాలుండగా.. ఈసారి ఆ సంఖ్యను 35,806కు పెంచాలని ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు అనుమతి కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ ప్రతిపాదనలు పంపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3 కోట్ల 31 లక్షల మంది ఓటర్లున్నారు.

మరోవైపు ఎన్నికల విధుల్లో పాల్గొనే 2లక్షల 60 వేల మంది ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలట్‌ ఇచ్చేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లుచేస్తోంది. ఓటరు కార్డు వివరాలను అందజేయాలని ఉద్యోగులను ఆదేశించింది. ఎన్నికల విధుల్లో ఎక్కడ ఉన్నా పోస్టల్‌ బ్యాలట్‌ పత్రం ఇస్తారు. పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లేందుకు అవసరమైన సామగ్రిని తీసుకునేందుకు ఏర్పాటు చేసే ఫెసిలిటీస్‌ కేంద్రంలోనే ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా బ్యాలట్‌ బాక్స్‌లను ఏర్పాటుచేస్తారు.

ఇప్పటివరకు 2 లక్షల 40 వేల మంది ఉద్యోగులు మాత్రమే ఓటరు కార్డు వివరాలను అధికారులకు అందచేశారు. ఆ వివరాలను అందజేసేందుకు ఈనెల 15వ తేదీ చివరి గడువుగా ఎన్నికల సంఘం నిర్ణయించింది. అప్పటిలోగా వివరాలను అందజేయని పక్షంలో వారికి ఓటు హక్కు ఉన్న నియోజకవర్గంలో పోలింగ్‌ రోజునే ఓటు హక్కు వినియోగించుకోవాల్సి వస్తుంది. ఓటు ఎక్కడ వినియోగించుకుంటారో నిర్ణయించుకునే వెసులుబాటును ఆయా ఉద్యోగులకే ఎన్నికల సంఘం ఇచ్చింది.

Tags:    

Similar News