Nagarjuna Sagar: నాగార్జునసాగర్‌కు పెరుగుతున్న వరద నీరు

Nagarjuna Sagar: శ్రీశైలం నుంచి 4 లక్షల 54వేల క్యూసెక్కుల వరద ఇన్‌ఫ్లో * 570 అడుగులకు చేరుకున్న నీటి మట్టం

Update: 2021-07-31 07:39 GMT
శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు వరద ఉదృతి (ఫోటో ది హిందూ)

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ శ్రీశైలం నుంచి 4 లక్షల 54వేల క్యూసెక్కుల వరద ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతోంది. దాంతో సాగర్ జలాశయం వడి వడిగా నిండుతోంది. నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం 590 అడుగులకు దాదాపు ప్రస్తుతం 570 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. సాగర్ నుంచి విద్యుత్ ఉత్పత్తి ద్వారా, ఏ ఎమ్మార్పీ ద్వారా కలిపి 63 వేల క్యూసెక్కుల నీరు ఔట్ ఫ్లోగా వెళ్తుంది. ప్రస్తుతం సాగర్ నీటిమట్టం 254 టీఎంసీలకు చేరుకుంది. సాగర్ జలాశయంకు భారీగా వరద రావడంతో క్రస్ట్ గేట్లను సీఈ శ్రీకాంతరావు, ఎస్ ఈ ధర్మ నాయక్ లు ఇంజనీరింగ్ అధికారుల తో కలిసి పరిశీలించారు. నాగార్జున సాగర్ జలాశయం ఇదే వరద కొనసాగితే మరొక రెండు రోజుల్లో క్రస్ట్ గేట్లను ఎత్తే అవకాశం ఉందని జలాశయం ఎస్ఈ ధర్మ నాయక్ తెలిపారు.

Full View


Tags:    

Similar News