నాగార్జున సాగర్ 4 గేట్లు ఎత్తివేత

Update: 2020-08-21 08:15 GMT

4 gates of Nagarjuna Sagar lifted : ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం నుంచి వస్తున్న ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో నాగార్జునసాగర్‌ నిండుకుండలా మారింది. ఇప్పటికే శ్రీశైలం జలాశయం పది గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తాజాగా నాగార్జునసాగర్‌ అధికారులు నీటిని కిందకు విడుదల చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు సాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహ్మయ్య, సీఈ నర్సింహా కలిసి క్రస్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.

నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585 అడుగుల నీరు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ : 312.0405 టీఎంసీలు కాగా..ప్రస్తుత నీటి నిల్వ : 290.టీఎంసీలుగా ఉంది. సాగర్‌కు ఇన్‌ఫ్లో 4 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. ఔట్‌ ఫ్లో 50 వేల క్యూసెక్కులు ఉంది. అయితే నాగార్జున సాగర్ గేట్లు తెరవడంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

Tags:    

Similar News