37th Hyderabad Book Fair 2024 : పుస్తక ప్రియులకు శుభవార్త.. ఈ ఏడాది హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో ఫ్రీ ఎంట్రీ.. ప్రారంభ తేదీ ఎప్పుడంటే..?

Update: 2024-11-05 00:30 GMT

37th Hyderabad Book Fair 2024 : పుస్తక ప్రియులకు శుభవార్త. ప్రతి సంవత్సరం విలువైన జ్ఞానాన్ని అందించడంతోపాటు తనదైన లోకంలో అనుభూతులను పంచే పుస్తక ప్రదర్శనశాల త్వరలోనే నగరవాసులను మరోసారి పలకరించేందుకు సిద్ధమవుతోంది. ప్రతి సంవత్సరం హైదరాబాద్ లో నేషనల్ బుక్ ఫెయిర్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తున్న ఈ బుక్ ఫెయిర్ 37వ ఎడిషన్ తో ఈ ఏడాది కూడా మీ ముందుకు వస్తోంది. డిసెంబర్ 19 నుంచి 29 వరకు పుస్తక ప్రదర్శనను నిర్వహించనున్నట్లు బుక్ ఫెయిర్ సొసైటీ వెల్లడించింది.

ఈ మేరకు సోమాజీగూడలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోదండరాంతోపాటు బుక్ ఫెయిర్ సలహాదారు ఆచార్య రమా మెల్కొటె తోపాటు పలువురు ప్రముఖుల పాల్గొన్నారు.

ఈ సంవత్సరం ననిర్వహించే పుస్తక ప్రదర్శనకు ఎమ్మెల్సీ కోదండరాం, సీనియర్ ఎడిటర్ రామచంద్రమూర్తి, ప్రొఫెసర్ రమా మెల్కొటే గౌరవ సలహాదారులుగా ఉంటారని తెలిపారు. ఈ సందర్భంగా గౌరవ సలహాదారులతోపాటు కమిటీ సభ్యులు బుక్ ఫెయిర్ కు సంబంధించిన లోగోను ఆవిష్కరించారు.

మొత్తంగా 300 పుస్తక స్టాళ్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. పుస్తక సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేస్తామని బుక్ ఫెయిర్ అధ్యక్షులు యాకుబ్ తెలిపారు.

ఇక ప్లాస్టిక్ నిషేధాన్ని పాటిస్తూ...సందర్శకుల కోసం టికెట్లతోపాటు బుక్స్ కోసం సంచిని ఇస్తామని బుక్ ఫెయిర్ అధ్యక్షుడు యాకుమ్ తెలిపారు. విద్యార్థులకు తమ ఐడీ కార్డులతో ఫ్రీ ఎంట్రీ కల్పిస్తామని తెలిపారు నిర్వాహకులు. మరిన్ని వివరాల కోసం 9490099081 సంప్రదించవచ్చని తెలిపారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడారు. పుస్తక ప్రదర్శన నగరవాసులకు మంచి అవకాశం అని అన్నారు. ఈ కార్యక్రమంలో బుక్ ఫెయిర్ సెక్రటరీ వాసు, కోశాధికారి నారాయణ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్లు కె. బాల్ రెడ్డి తోపాటు పలువురు పాల్గొన్నారు. 

Tags:    

Similar News