తెలంగాణలో కొత్తగా మరో 288 బస్తీ దవాఖానాలు
TS News: *పట్టణ పేదలకు చేరువకానున్న నాణ్యమైన వైద్యసేవలు *టీ డయాగ్నోస్టిక్ సహకారంతో ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు
TS News: పట్టణ పేదలకు మెరుగైన వైద్యాన్ని ఉచితంగా అందించాలనే లక్ష్యంతో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ఇతర పట్టణాటలకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో అన్ని మున్సిపాలిటీల్లో కొత్తగా మొత్తం 288 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యింది. వచ్చే ఆరు నెలల్లో వీటిని అందుబాటులోకి తేవాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఎంసీహెచ్‌ఆర్డీలో వైద్యారోగ్యశాఖ, మున్సిపల్ శాఖలు సంయుక్తంగా పట్టణాల్లో బస్తీ దవాఖానాల ఏర్పాటు గురించి చర్చించాయి.