Telangana: యాదాద్రి ఆలయంలో కరోనా కలకలం
Telangana: యాదాద్రిలో కరోనా కలకలం రేపుతోంది. రోజు రోజుకు భారీగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి.
Telangana: యాదాద్రిలో కరోనా కలకలం రేపుతోంది. రోజు రోజుకు భారీగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. నిన్నటికే 36 మంది అర్చకులు, ఆలయ సిబ్బందికి కరోనా సోకింది. దాంతో వైద్యాధికారులు టెస్ట్‌లను పెంచారు. దాంతో ఇవాళ మరో 26 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దాంతో గుడిలో పాజిటివ్ కేసుల సంఖ్య 60 దాటింది. దీంతో ఆలయంలోకి భక్తులను అనుమతి నిరాకరించారు. కేసులు పెరుగుతుండడంతో బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న భక్తులు భయాందోళనకు గురి అవుతున్నారు.
ఇటీవల యాదగిరి నరసింహ్మాస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఆ ఉత్సవాల్లోనే కొవిడ్ కలకలం సృష్టించింది. ఇప్పుడు రోజు రోజుకు కేసులు పెరుగుతుండడంతో బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న వారిలో ఆందోళన పెరుగుతోంది. అర్చకులు, ఆలయ సిబ్బందితో పాటు జర్నలిస్టులకు కూడా కోవిడ్ సోకింది. ఇంకా కరోనా పరీక్షలు కొనసాగుతున్నాయి. దాంతో ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.