Coronavirus Updates in Telangana | తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 58,925 నమూనాలు పరిశీలించగా కొత్తగా 2,239 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 1,091కి చేరింది. నిన్న ఒక్క రోజే 2,181 కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,83,866కి చేరింది. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన సంఖ్య 1,52,441కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,334 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 24,683 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 28,00,761కి చేరింది.