తెలంగాణలో కొత్తగా 1,983 కరోనా కేసులు

Update: 2020-10-06 04:18 GMT

Coronavirus Updates in Telangana | తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1983 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 1181కి చేరింది. నిన్న ఒక్క రోజే 2381 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,02,594కి చేరింది. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన సంఖ్య 1,74,769కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 26,644 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, మరో 21,784 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఆరోగ్యశాఖ చెప్పింది. గడిచిన 24 గంటల్లో 50,598 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటివరకు 32,92,195 టెస్టులు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.58శాతంగా ఉందని, అలాగే రికవరీ రేటు 86.26 శాతంగా ఉందని తెలిపింది.



Tags:    

Similar News