TS Corona Cases: తెలంగాణలో కొత్త‌గా 1,771 కరోనా కేసులు, 13 మరణాలు

Update: 2021-06-12 14:53 GMT

క‌రోనా వైర‌స్ ప్ర‌తీకాత్మ‌క చిత్రం

TS Corona Cases:  క‌రోనా సెకండ్ వేవ్ ఉదృతి తెలంగాణ‌లో నెమ్మ‌దించింది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,20,525 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,771 మందికి పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ లో ప్ర‌క‌టించింది. తాజా మరణాలతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,469కి పెరిగింది.

అదే సమయంలో 2,384 మంది కరోనా నుంచి కోలుకోగా... 13 మంది మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటివరకు 6,02,089 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,76,487 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 22,133 మంది చికిత్స పొందుతున్నారు.

జీహెచ్ఎంసీ పరిధిలో 171 కొత్త కేసులు నమోదు కాగా, నల్గొండ జిల్లాలో 157, ఖమ్మం జిల్లాలో 149, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 107, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 104 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కామారెడ్డి జిల్లాలో 2 కేసులు గుర్తించారు.





Tags:    

Similar News