అయోధ్యకు హైదరాబాద్ నుంచి 1265 కిలోల లడ్డూ
Ayodhya: ఇవాళ లడ్డూ యాత్రను ప్రారంభించనున్న కిషన్‌రెడ్డి
Ayodhya: అయోధ్య రాముడి ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రాణప్రతిష్టాపన సందర్భంగా కానుకలు వెల్లువలా వస్తున్నాయి. ఇప్పటికే పలువురు భక్తలు తమ భక్తితో స్వామివారి ఆలయానికి తమకు తోచిన కానుకలు పంపుతుండగా.. సికింద్రాబాద్ నుంచి కూడా ఓ భక్తుడు భారీ లడ్డూను తరలించేందుకు సిద్ధమయ్యారు. కంటోన్మెంట్‌కు చెందిన శ్రీరామ క్యాటరింగ్ సర్వీసెస్ యజమాని నాగభూషణం.. 12 వందల 65 కిలోల లడ్డూను తయారుచేశారు.
ఇవాళ ఈ లడ్డూను అయోధ్య తరలిస్తుండగా.. యాత్రను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన రోజు నుంచి ప్రాణప్రతిష్టకు ఎన్ని రోజులు పట్టిందో అన్ని కేజీల లడ్డూ తయారు చేయాలని నాగభూషణం సంకల్పం చేసుకున్నారు. ఆ విధంగా 12 వందల 65 రోజులకు గాను 12 వందల 65 కిలోల లడ్డూ తయారుచేశారు.