తెలంగాణలో కొత్తగా 118 కరోనా కేసులు

Update: 2021-02-01 04:47 GMT

తెలంగాణలో కొత్తగా 118 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో 118 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో కేసుల సంఖ్య 2,94,587కి పెరిగింది. వైరస్‌ కారణంగా ఇద్దరు మృతి చెందడంతో మరణాల సంఖ్య 1,601కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 264 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,90,894కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,092 ఉండగా వీరిలో 723 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 17,686 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనాపరీక్షల సంఖ్య 78,79,047కి చేరింది.


 


Tags:    

Similar News