Samsung Galaxy A26: AI ఫీచర్లతో కొత్త సామ్‌సంగ్ 5జీ ఫోన్.. ఆఫర్లు భలేగా ఉన్నాయ్..!

Samsung Galaxy A26: సామ్‌సంగ్ తన తాజా గెలాక్సీ A26 స్మార్ట్‌ఫోన్‌తో పాటు గెలాక్సీ A36 , Galaxy A56 ను ఈ నెల ప్రారంభంలో ప్రకటించింది. ఇప్పుడు కంపెనీ A26 స్మార్ట్‌ఫోన్ ధరను ధృవీకరించింది.

Update: 2025-03-24 14:30 GMT
Samsung Galaxy A26

Samsung Galaxy A26: AI ఫీచర్లతో కొత్త సామ్‌సంగ్ 5జీ ఫోన్.. ఆఫర్లు భలేగా ఉన్నాయ్..!

  • whatsapp icon

Samsung Galaxy A26: సామ్‌సంగ్ తన తాజా గెలాక్సీ A26 స్మార్ట్‌ఫోన్‌తో పాటు గెలాక్సీ A36 , Galaxy A56 ను ఈ నెల ప్రారంభంలో ప్రకటించింది. ఇప్పుడు కంపెనీ A26 స్మార్ట్‌ఫోన్ ధరను ధృవీకరించింది. కొత్త గెలాక్సీ ఎ సిరీస్ ఫోన్‌లతో, రూ. 25,000 ధర విభాగంలో ఫోన్లను కొనుగోలు చేసే వినియోగదారుల కోసం సామ్‌సంగ్ AI ఫీచర్లను తీసుకువస్తోంది. IP67 వాటర్-రెసిస్టెంట్ రేటింగ్, పెద్ద డిస్‌ప్లే, బ్యాటరీ, 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. కొత్త Samsung Galaxy A26 స్మార్ట్‌ఫోన్ స్పెక్స్, ధర ,ఆఫర్‌లు తదితర వివరాలు తెలుసుకుందాం.

Samsung Galaxy A26 Price And Offers

సామ్‌సంగ్ గెలాక్సీ A26 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.24,999. భారత్‌లో 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.27,999. లాంచ్ ఆఫర్ కింద, మీరు HDFC , SBI క్రెడిట్ కార్డ్‌లపై రూ. 2,000 తగ్గింపు లభిస్తుంది. దీని వలన బేస్ మోడల్ ధర రూ.22,999కి తగ్గుతుంది. ఫోన్ బ్లాక్, మింట్, వైట్, పీచ్ కలర్స్‌తో వస్తుంది.

Samsung Galaxy A26 Features

గెలాక్సీ A26 5G 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల FHD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ కోటింగ్‌ను అందిస్తుంది. Exynos 1380 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ ఉంది, ఇందులో నాలుగు క్వాడ్ A78 కోర్లు 2.4GHz, నాలుగు క్వాడ్ A55 CPU కోర్లు 2.0GHz వద్ద క్లాక్ చేశారు. 128జీబీ లేదా 256జీబీ స్టోరేజ్‌తో 8జీబీ ర్యామ్ ఉంటుంది. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీని 2TB వరకు విస్తరించవచ్చు. ఈ ఫోన్ ఆరేళ్లపాటు ఆరు ఓఎస్ అప్‌డేట్‌లు, సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తుంది.

ఫోటోగ్రఫీ ప్రియుల కోసం గెలాక్సీ A26 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది. ఇందులో f/1.8 ఎపర్చరు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన 50MP ప్రైమరీ సెన్సార్, f/2.2 ఎపర్చర్‌తో కూడిన 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, f/2.4 ఎపర్చర్‌తో 2MP మాక్రో సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో f/2.2 ఎపర్చరుతో 13MP సెల్ఫీ కెమెరా ఉంది. ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందుబాటులో ఉంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ ఉంది.

Tags:    

Similar News