Realme P3 5G Sale: ఈరోజే ఫస్ట్ సేల్.. రియల్‌మీ P3 5జీపై భారీగా డిస్కౌంట్.. ఇలా కొంటే..!

Realme P3 5G Sale: రియల్‌మీ కంపెనీ తాజాగా కొత్త మొబైల్‌ను విడుదల చేసింది.

Update: 2025-03-26 08:13 GMT
Realme P3 5G Sale Offers Specifications all Details

Realme P3 5G Sale: ఈరోజే ఫస్ట్ సేల్.. రియల్‌మీ P3 5జీపై భారీగా డిస్కౌంట్.. ఇలా కొంటే..!

  • whatsapp icon

Realme P3 5G Sale: రియల్‌మీ కంపెనీ తాజాగా కొత్త మొబైల్‌ను విడుదల చేసింది. ఇది Realme P3 5G పేరుతో మార్కెట్లోకి వచ్చింది. 'పి' సిరీస్‌లో ఈ ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ మొబైల్ పెద్ద బ్యాటరీ, బాంబస్టిక్ కెమెరా సెటప్‌తో వచ్చింది. రూ. 15,000 బడ్జెట్‌లోనే ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ధర, ఆఫర్స్, ఫికేషన్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం.

Realme P3 5G Features

రియల్‌మీ P3 5జీ ఫోన్‌లో 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 2400 × 1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1500Hz టచ్ శాంప్లింగ్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ మొబైల్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. మొబైల్‌లో స్నాప్‌డ్రాగన్ 6 Gen 4 ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంది. ఇది Realme UI 6.0 ఆధారంగా ఆండ్రాయిడ్ 15ని ఈ ఫోన్ రన్ చేస్తుంది. గ్రాఫిక్స్ కోసం, Adreno 810 GPU ఉంది. ఈ ఫోన్ 6GB RAM+ 128GB, 8GB RAM+256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి.

రియల్‌మీ P3 5జీ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో LED ఫ్లాష్‌తో 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. 2-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా కూడా అందుబాటులో ఉంది. ఇందులో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఫోన్‌లో 6000mAh కెపాసిటీ బ్యాటరీ ఉంది. దీన్ని ఛార్జ్ చేయడానికి, 45W ఫాస్ట్ ఛార్జింగ్ అందించారు. USB టైప్-సి ఆడియో, స్టీరియో స్పీకర్లు అందుబాటులో ఉన్నాయి. I కనెక్టివిటీ ఎంపికలలో 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.2, GPS, NFC, USB టైప్-C ఉన్నాయి.

Realme P3 5G Price And Offers

రియల్‌మీ P3 5జీ 6GB RAM + 128GB స్టోరేజ్ రూ. 16,999కాగా, 8GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ.17,999. 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.19,999కి అందుబాటులో ఉంటుంది. కంపెనీకి 2,000 బ్యాంక్ ఆఫర్ ప్రకటించింది. పాత కస్టమర్లకు 500 అదనపు తగ్గింపు ఇస్తుంది. ఈ మొబైల్ స్పేస్ సిల్వర్, కామెట్ గ్రే, నెబ్యులా పింక్ కలర్స్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఈరోజు అధికారిక వెబ్‌సైట్, రియల్‌మీ స్టోర్ యాప్, ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌కి వస్తుంది.

Tags:    

Similar News