Google Pixel 9a: 5,100mAh బ్యాటరీతో గూగుల్ పిక్సెల్ 9a వచ్చేస్తోంది.. ఫీచర్స్ లీక్.. పూర్తి వివరాలు ఇవే!
Google Pixel 9a: గూగుల్ చౌకైన ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకో శుభవార్త ఉంది.

Google Pixel 9a: 5,100mAh బ్యాటరీతో గూగుల్ పిక్సెల్ 9a వచ్చేస్తోంది.. ఫీచర్స్ లీక్.. పూర్తి వివరాలు ఇవే!
Google Pixel 9a: గూగుల్ చౌకైన ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకో శుభవార్త ఉంది. నిజానికి Pixel 9a ఏప్రిల్ 16న భారత్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ ఫోన్ ఆస్ట్రేలియా, సింగపూర్, తైవాన్, మలేషియాలో కూడా విడుదల కానుంది. ఈ ఫోన్ ఫస్ట్ సేల్ఏప్రిల్ 10న యూఎస్, కెనడా,యూకేలో అందుబాటులో ఉంటుంది. ఈ నెల మార్చి 19న కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు తదితర వివరాలు తెలుసుకుందాం.
పిక్సెల్ 9a అనేక అప్‌గ్రేడ్‌లను తీసుకువస్తుంది, సాధారణ కెమెరా బంప్‌ను తొలగించే కొత్త డిజైన్‌ను అందిస్తుంది. మొబైల్‌లో 6.3-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 2,700నిట్‌ల పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది Pixel 8a చిన్న 6.1-అంగుళాల స్క్రీన్, తక్కువ ప్రకాశం స్థాయిల నుండి పెద్ద అప్‌గ్రేడ్.
గూగుల్ కస్టమ్-బిల్ట్ టెన్సర్ G4 ప్రాసెసర్ Pixel 9aలో అందుబాటులో ఉంది. ఫోన్ 8జీబీ ర్యామ్‌తో గొప్ప పనితీరును అందిస్తుంది. కెమెరా పరంగా కూడా ఫోన్ చాలా అద్భుతంగా ఉంది. అలానే 48-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ,13-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఇది మాత్రమే కాదు, ఫోన్‌కు ప్రత్యేక మాక్రో మోడ్ కూడా ఇచ్చారు, ఇది క్లోజప్ షాట్‌ల కోసం ప్రైమరీ కెమెరా సెన్సార్‌ను ఉపయోగిస్తుంది. సెల్ఫీ కోసం ఫోన్‌లో 13-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
పిక్సెల్ 9a బ్యాటరీ లైఫ్ మునుపటి కంటే మెరుగ్గా ఉంది. ఫోన్‌లో 5,100mAh బ్యాటరీ ఉంది, ఇది దాని మునుపటి మోడల్ 4402mAh బ్యాటరీ నుండి పెద్ద అప్‌గ్రేడ్. ఇది Qi వైర్‌లెస్ ఛార్జింగ్, 23W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది. కాబట్టి వినియోగదారులు అవసరమైనప్పుడు మొబైల్‌ని వేగంగా రీఛార్జ్ చేయచ్చు. అలానే IP68 రేటింగ్ కూడా అందించారు. అంటే నీటిలో మునిగిపోయినప్పటికీ అది పాడైపోదు.