Realme Carnival Sale: రియల్‌మి కార్నివల్ సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్‌లపై భారీగా డిస్కౌంట్లు.. మిస్ అయితే కష్టమే..!

Realme Carnival Sale: రియల్‌మి తన పి సిరీస్‌పై ఈరోజు ఏప్రిల్ 22 నుండి గొప్ప డిస్కౌంట్లను అందిస్తుంది. ఇప్పుడు 20 లక్షల మంది ఈ సిరీస్ ఫోన్‌లను కొనుగోలు చేశారు.

Update: 2025-04-22 07:48 GMT
Realme Carnival Sale: రియల్‌మి కార్నివల్ సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్‌లపై భారీగా డిస్కౌంట్లు.. మిస్ అయితే కష్టమే..!
  • whatsapp icon

Realme Carnival Sale: రియల్‌మి తన పి సిరీస్‌పై ఈరోజు ఏప్రిల్ 22 నుండి గొప్ప డిస్కౌంట్లను అందిస్తుంది. ఇప్పుడు 20 లక్షల మంది ఈ సిరీస్ ఫోన్‌లను కొనుగోలు చేశారు. రియల్‌మి కార్నివాల్ సేల్‌లో రియల్‌మి పి3 సిరీస్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నారు. ఈ సేల్‌లో రియల్‌మి పి3 5జి, రియల్‌మి పి3 ప్రో 5జిలపై రూ.4000 వరకు తగ్గింపు అందిస్తున్నారు. ఈ ఆఫర్లు రియల్‌మి అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తాయి. రియల్‌మి కార్నివాల్ సేల్ ఏప్రిల్ 24 వరకు కొనసాగనుంది. ఈ రియల్‌మి ఫోన్‌లు పవర్-ప్యాక్డ్ ఫీచర్లతో ఉన్నాయి. రియల్‌మి పి3 సిరీస్‌లో లభించే డిస్కౌంట్లు, ఆఫర్లు, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

Realme P3 Pro 5G Discounts

స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్, గ్లో-ఇన్-ది-డార్క్ డిజైన్‌ను కలిగి ఉన్న రియల్‌మి పి3 ప్రో 5జి ఈ సేల్‌లో రూ. 4,000 బ్యాంక్ తగ్గింపుతో లభిస్తుంది. ఈ తగ్గింపు తర్వాత, మీరు రూ.19,999కి ఫోన్‌ను కొనుగోలు చేయగలరు. దీనితో పాటు, ఫోన్‌పై రూ. 3000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా ఉంది, దీని ద్వారా మీరు ఫోన్ ధరను మరింత తగ్గించవచ్చు.

Realme P3 5G

ఈ సేల్‌లో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్, 6000mAh బ్యాటరీతో వచ్చే రియల్‌మి పి3 5జిని రూ.2000 బ్యాంక్ డిస్కౌంట్‌తో విక్రయిస్తున్నారు. 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ బేస్ వేరియంట్‌పై రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్ తర్వాత రూ.15,999కి కొనుగోలు చేయచ్చు. ఫోన్ రెండవ వేరియంట్, 8జీబీ ర్యామ్, 128జీబీ మోడల్, రూ. 2000 బ్యాంక్ డిస్కౌంట్ తర్వాత రూ. 15,999కు కొనుగోలు చేయచ్చు.

Realme P3 Pro Specifications

రియల్‌మి పి3 ప్రో అనేది ఈ విభాగంలో స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 SoC ప్రాసెసర్‌పై వస్తున్న మొదటి ఫోన్. ఇందులో AI నైట్ మోడ్, స్మార్ట్ AI పోర్ట్రెయిట్ వంటి ప్రత్యేక AI కెమెరా ఫీచర్లు ఉన్నాయి. ప్రైమరీ లెన్స్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) తో కూడిన 50MP సెన్సార్. రియల్‌మి పి3 ప్రోలో కర్వ్డ్ డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్ 6000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. 80వాట్స్ సూపర్‌వూక్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్ IP66/IP68/IP69 రేటింగ్ పొందింది.

Realme P3 Pro 5G Specifications

రియల్‌మి ఫోన్‌లో 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్‌లో క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్‌సెట్ ఉంది. ఫోన్‌లో GT బూస్ట్ ఫీచర్ అందించారు. ఇది AI మోషన్ కంట్రోల్, AI అల్ట్రా టచ్ కంట్రోల్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్ IP69 వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది, ఇది మీ ఫోన్ ను నీటి తుంపర్ల నుండి సురక్షితంగా ఉంచుతుంది. కెమెరా గురించి మాట్లాడుకుంటే, ఇందులో 50MP AI వెనుక కెమెరా సెన్సార్, 2MP పోర్ట్రెయిట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్‌లో సెల్ఫీలు,వీడియో కాలింగ్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. రియల్‌మి పి3 5జి ఫోన్‌లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

Tags:    

Similar News