BSNL: బీఎస్ఎన్ఎల్ బంపర్ ఛాన్స్.. 60 రోజుల నయా రీఛార్జ్ ప్లాన్..!
BSNL 60 Days Plan: భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (BSNL) 60 రోజుల కొత్త వ్యాలిడిటీ ప్లాను అందుబాటులోకి తీసుకువచ్చింది.

BSNL: బీఎస్ఎన్ఎల్ బంపర్ ఛాన్స్.. 60 రోజుల నయా రీఛార్జ్ ప్లాన్..!
BSNL 60 Days Plan: భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (BSNL) 60 రోజుల కొత్త వ్యాలిడిటీ ప్లాను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో కేవలం రూ.345 కు మాత్రమే మీరు ఈ ప్లాన్ పొందుతారు. టెలికాం ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ మాత్రం ఇంత తక్కువ ధరలోనే 60 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది.
ప్రభుత్వ దిగ్గజ కంపెనీ బిఎస్ఎన్ఎల్ తక్కువ ధరలోనే కస్టమర్లను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 4జి సేవలని విస్తరిస్తోంది. సాధారణంగా అయితే మూడింతలు ఎక్కువగా ఉంటుంది. కానీ బీఎస్ఎన్ఎల్ మాత్రం రూ.345 కి మాత్రమే ఈ ప్లాను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో ఇతర బెనిఫిట్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
బీఎస్ఎన్ఎల్ రూ.345 ప్లాన్ తో యూజర్లు 60 రోజులపాటు వ్యాలిడిటీ పొందుతారు. అంతేకాదు ఈ ప్లాన్ లో మీరు ప్రతిరోజు 1 జీబీ డేటా పొందుతారు. దీంతో పాటు 100 ఎస్ఎంఎస్ లు ఉచితం. అయితే మరింత డేటా కావాలంటే రూ.347 ప్లాన్ కూడా అందుబాటులో ఉంది .
రూ.345 ప్లాన్ కంటే కేవలం రూ.2 అదనం. కానీ, ఇందులో వంద ఎస్ఎంఎస్లు ఉచితం. ప్రతిరోజు 2gb డైలీ డేటా పొందుతారు. అయితే దీని వ్యాలిడిటీ కేవలం 54 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ లో డేటా పెరుగుతుంది, వ్యాలిడిటీ తగ్గుతుంది. డేటా ఎక్కువగా వినియోగించే వారికి ఇది బంపర్ ప్లాన్.
ఒకవేళ మీకు లాంగ్ టర్మ్ వ్యాలిడిటీ కావాలంటే మొదటిది ఎంచుకోండి. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ 4g సేవలను లక్షకు పైగా టవర్లను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా కూడా అందుబాటులో తీసుకువచ్చేందుకు విశేష కృషి చేస్తోంది.