Fruit waste to clean water?: పండ్ల వ్యర్థాలతో ఐఐటీ గౌహతి శాస్త్రవేత్తల వినూత్న ప్రయోగం.. ఏం చేశారో చూడండి!

Fruit waste to clean water?: ఈ పద్ధతి భవిష్యత్తులో నీటి కాలుష్య సమస్యకు సులభమైన పరిష్కారంగా మారే అవకాశం ఉంది.

Update: 2025-03-26 04:30 GMT
Fruit waste to clean water

Fruit waste to clean water?: పండ్ల వ్యర్థాలతో ఐఐటీ గౌహతి శాస్త్రవేత్తల వినూత్న ప్రయోగం.. ఏం చేశారో చూడండి!

  • whatsapp icon

Fruit waste to clean water?: ఒకప్పుడు చెత్తగా పారేసే పైనాపిల్ తలలు, మోసంబి ఫైబర్లను శుద్ధి కోసం ఉపయోగిస్తారని ఎవరు ఊహించగలరు? కానీ ఐఐటీ గౌహతి శాస్త్రవేత్తలు ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. పరిశ్రమల నుండి విడుదలయ్యే విషపూరిత నీటిని శుభ్రం చేయడంలో ఇప్పుడు పండ్ల వ్యర్థాలే కీలక పాత్ర పోషిస్తున్నాయి. పరిశోధకులు ఈ వ్యర్థాలను బయోచార్‌గా మార్చి, వాటిని నీటిలోని విషకర రసాయనాలను శోషించగల సామర్థ్యం కలిగిన పదార్థాలుగా అభివృద్ధి చేశారు.

ఈ ప్రయోగానికి శాస్త్రపరమైన ఆధారాలున్నాయి. రసాయనశాస్త్ర విభాగానికి చెందిన డాక్టర్ గోపాల్ దాస్ నేతృత్వంలోని బృందం ఈ పరిశోధనను కేమికల్‌ ఇంజనీరింగ్‌ సైన్స్ అనే జర్నల్‌లో ప్రచురించింది. పరిశ్రమలలో ఉపయోగించే రంగులు, ఔషధాలు, పురుగుమందుల్లో కనిపించే నైట్రోమేటిక్ పదార్థాలను తొలగించడంలో ఈ బయోచార్ అద్భుత ఫలితాలను ఇచ్చింది.

పైనాపిల్ తలల నుంచి తయారైన బయోచార్ 99 శాతం రసాయనాలను, మోసంబి ఫైబర్లతో తయారైనది 97 శాతం వరకు తొలగించగలదని పరీక్షల్లో తేలింది. అద్భుతమైన విషయం ఏమిటంటే, ఈ శోషణ ప్రక్రియకు కేవలం ఐదు నిమిషాల సమయం చాలని తేలింది. ఇదే సమయంలో, ఇది విద్యుత్‌ను తక్కువగా వినియోగిస్తుంది మరియు పునర్వినియోగానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇది పరిశ్రమలకే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి శుద్ధికి కూడా ఉపయోగపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాజెక్టును ప్రాథమిక స్థాయిలో ప్రయోగాత్మకంగా రూరల్‌ వాటర్‌ ప్యూరిఫికేషన్‌పై కొనసాగిస్తున్నారు. దీన్ని పెద్ద స్థాయిలో రూపొందించేందుకు పరిశోధక బృందం ఉత్పత్తిదారులతో సంప్రదింపులు జరుపుతోంది.

Tags:    

Similar News