Akai AC: హాట్‌సమ్మర్‌కు అకాయ్ ఏసీ.. 55 డిగ్రీల వేడిలోను మీ ఇంటిని కశ్మీర్‌గా మార్చే కూలింగ్ టెక్నాలజీ..!
Akai Launches Acs: హాట్ సమ్మర్‌లో అదిరిపోయే కశ్మీర్, నిలగిరి సియాచిన్ ఏసీలు. 55 డిగ్రీల ఎండ వేడిలో కూడా కూల్ కూల్ ఫీలింగ్.

Akai AC: హాట్‌సమ్మర్‌కు అకాయ్ ఏసీ.. 55 డిగ్రీల వేడిలోను మీ ఇంటిని కశ్మీర్‌గా మార్చే కూలింగ్ టెక్నాలజీ..!
Akai Launches Acs: భారత దిగ్గజ ఎలక్ట్రానిక బ్రాండ్ అకాయ్ కొత్త ఏసీలను ప్రారంభించింది. మండే ఎండలో చల్లదనాన్ని అందించే ఏసీలు ఎక్కువ మంది ఛాయిస్. ఎయిర్ కండీషనర్ కొనుగోలుదారుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. బడ్జెట్ ధరలో క్విక్ అడ్వాస్డ్ కూలింగ్ అందరి ఎంపిక. ఈ నేపథ్యంలో మీరు కూడా ఇలాంటి ఏసీల కోసమే చూస్తున్నట్లయితే, మీకు అకాయ్ బెస్ట్ ఛాయిస్. అకాయ్ నుంచి మూడు బెస్ట్ ఏసీలను పరిచయం చేస్తోంది. అకాయ్ సియాచిన్ (హెవీ డ్యూటీ), అకాయ్ నిలగిరి (ఎకానమీ), అకాయ్ కశ్మీర్ (హాట్, కోల్డ్) ప్రత్యేకంగా మన భారతీయ వాతావరణానికి తగినట్లుగా రూపొందించారు.
అకాయ్ ఏసీ ధరలు ఇలా ఉన్నాయి..
అకాయ్ ఏసీల ప్రారంభ ధర రూ.30,990 నుంచి అందుబాటులో ఉన్నాయి. ఇది అడ్వాన్డ్స్ టెక్నాలజీతో రూపొందించినది. ఇక క్వాలిటీ గురించి ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వాల్సిన పనిలేదు. ఈ అకాయ్ ఏసీలు దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ రిటైల్ దుకాణాల్లో అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ ఏసీల వ్యారంటీ ఏడాది పాటు ఉంటుంది. పీసీబీ వ్యారంటీ 5 ఏళ్లు. కంప్రెసర్ ఇన్వర్టర్ మోడల్ ఏసీ వ్యారంటీ 10 ఏళ్లు గ్యారంటీ.
అకాయ్ సియాచిన్..
ఇది ఎంతటి ఎండ వేడిమి సమయంలో కూడా రూమ్‌ను ఒక్కసారిగా చల్లబరుస్తుంది. 55 డిగ్రీల ఎండలో చల్లదనం గ్యారంటీ. ఇందులో హై కెపాసిటీ కంప్రెసర్ 8 ఇన్ 1 ఫ్లెక్సీ కూలింగ్ మోడ్. 4 మార్గాల్లో స్వింగ్ ఎయిర్‌ఫ్లో వీస్తుంది. మంచి ఫిల్టర్‌లు అలెర్జీ ఫ్రీ.
అకాయ్ నిలగిరి..
అకాయ్ నిలగిరి కూడా మంచి కూలింగ్ ఇస్తుంది. pm1 ఫిల్టర్, నాలుగు దిక్కుల స్వింగ్, 8 ఇన్ 1 ఫ్లెక్సీ మోడ్ సూపీరియర్ ఎయిర్ సర్క్యూలేషన్, ప్యూరిఫికేషన్ కలిగిన ఏసీ. ధర కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ..
అకాయ్ కశ్మీరి..
ఈ ఏసీ కేవలం ఎండాకాలం మాత్రమే కాదు ఏడాదిపాటు నడిపించదగే ఏసీ ఈ ఏసీ ఉంటే మీ ఇల్లు కశ్మిరే. ఎండాకాలం, చలికాలంలో కూడా ఉపయోగకరమైన ఏసీ. 10 డిగ్రీల నుంచి 55 డిగ్రీల ఉష్ణోగ్రతకు పెర్పెక్ట్. అంతేకాదు ఇందులో బ్లూ యాంటీ కరోజివ్ ఫిన్స్, పీఎం1 ఫిల్టర్, గాలిని శుద్ధి చేసే ఏసీ.