Jio: జియో బంపర్ ఆఫర్ రూ.2000 లోపే .. ఏడాది వ్యాలిడిటీ ప్లాన్, అపరిమిత వాయిస్ కాలింగ్, ఇతర బెనిఫిట్స్..
Jio 1 Year Validity Plan: ప్రైవేట్ దిగ్గజ కంపెనీ రిలయన్స్ జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది. యూజర్లకు కేవలం రూ.2000 లోపు ఏడాది వ్యాలిడిటీ ప్లాన్ అందిస్తుంది.

Jio: జియో బంపర్ ఆఫర్ రూ.2000 లోపే .. ఏడాది వ్యాలిడిటీ ప్లాన్, అపరిమిత వాయిస్ కాలింగ్, ఇతర బెనిఫిట్స్..
Jio 1 Year Validity Plan: జియో అద్భుతమైన ఆఫర్లను ప్రకటిస్తుంది. ఈ నేపథ్యంలో ముకేశ్ అంబానికి చెందిన రిలయన్స్ జియో మరో అద్భుతమైన ప్లాన్ మీ ముందుకు వచ్చింది. ఖాతాదారులకు తక్కువ ధరలోనే రీఛార్జి ప్లాన్ అందుబాటులోకి తీసుకువస్తుంది. రూ. 1748 రూపాయల్లో ఏకంగా ఏడాదిపాటు రీఛార్జ్ చేసుకోకుండా ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు.
రిలయన్స్ జియో కస్టమర్స్ ఎక్కువ శాతం మంది ఈ ప్యాకేజీకి ఆకర్షితులు అవుతున్నారు. ఈరోజు ఈ రిలయన్స్ జియో రూ.2000 లోపే అద్భుతమైన ప్లాన్ ఏడాది పాటు వ్యాలిడిటీతో పాటు ఇతర ఏ బెనిఫిట్స్ పొందుతారు తెలుసుకుందాం.
జియో రూ.1748 ప్లాన్..
జియో అందిస్తున్న ఈ రీఛార్జ్ ప్లాన్ 336 రోజులపాటు వ్యాలిడిటీ వస్తుంది. అంటే దాదాపు ఏడాది పాటు జియో యూజర్లకు అపరిమిత వాయిస్ కాలింగ్ పొందుతారు. ఇది కాకుండా 3,600 ఎస్ఎంఎస్‌లు కూడా పొందుతారు. అయితే ఈ ప్లాన్‌లో డేటా అందుబాటులో లేదు. ఈ ప్లాన్‌తో రీఛార్జీ చేసుకుంటే జియో టీవీ, జియో క్లౌడ్ మాత్రం ఉచిత సబ్స్ క్రిప్షన్ పొందుతారు.
ఈ రిలయన్స్ రూ.1748 ప్లాన్ ఫీచర్ ఫోన్ ఉపయోగించే వారికి ఎంతో బెస్ట్. ప్రధానంగా డేటా ఎక్కువ ఉపయోగించలేని వారికి బడ్జెట్‌లోనే అందుబాటులో ఉంది. అంటే ఎక్కువగా డేటా ఖర్చు పెట్టకుండానే కేవలం ఉచిత వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్‌లకు ఖర్చు చేస్తే సరిపోతుంది. జియో అందిస్తున్న ఈ ప్లాన్‌కు మీరు డేటా కూడా పొందాలంటే యాడాన్ డేటా రీఛార్జ్ చేసుకోవాల్సిందే.
ఇక పెరిగిన టెలికాం ధరల తర్వాత జియో పెద్ద సంఖ్యలో తమ యూజర్‌లను పోగొట్టుకుంది. ఎక్కువ శాతం మంది బీఎస్ఎన్ఎల్‌కు పోర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో మళ్లీ తిరిగి వారిని ఆకర్షించేందుకు ప్రైవేట్ దిగ్గజ కంపెనీ ఇలాంటి రీచార్జ్ ప్యాక్లను అందుబాటులోకి తీసుకువస్తుంది. అయితే ట్రయ్ ఆదేశాల మేరకు వాయిస్ ఓన్లీ ప్లాన్స్ (VOP)ని అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.