AC: ఏసీలు కొనుగోలు చేస్తున్నారా? 1 టన్, 1.5 టన్ అంటే ఏంటో తెలియకుండానే వాడుతున్నారా?
AC Buying Tips: మండే ఎండలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఏసీలు, ఫ్రిడ్జ్, కూలర్ల వినియోగం బాగా పెరిగింది. అయితే, ఏసీ కొనుగోలు చేసే ముందు ప్రతి ఒక్కరూ కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకోవాలి.
AC: ఏసీలు కొనుగోలు చేస్తున్నారా? 1 టన్, 1.5 టన్ అంటే ఏంటో తెలియకుండానే వాడుతున్నారా?
AC Buying Tips: ఈ ఎండలకు చల్లదనాన్ని ఇచ్చే ఏసీలు ఈ మధ్యలో ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అయితే ఏసీలో టన్ అంటే ఏంటిది? ఏసీ ఎంత చల్ల గాలిని ఇస్తుంది? వన్ టన్, 1.5 టన్, 2 టన్ ఏసీలు ఎవరు కొనుగోలు చేయాలి? ఎలాంటి రూములకు సరిపోతాయి? దీని అర్థం ఏంటి ఈ రోజు తెలుసుకుందాం.
సాధారణంగా ఏసీ కొనుగోలు చేసేటప్పుడు దాని శితలీకారణ సామర్థ్యం కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. టన్ అంటే ఏసీ ఎంత చల్లదనాన్ని అందిస్తుంది. ఎలాంటి రూములకు సెట్ అవుతాయి. తెలుసుకుందాం...చిన్న గదులకు ఒక్క టన్ ఏసీ సరిపోతుంది. ఇక 1.5 టన్ మీడియం సైజు గదులకు అంటే దాదాపు 120 చదరపు అడుగుల గదులకు చల్లదనాన్ని అందించడంలో సరిపోతుంది. ఇక 2 టన్ ఏసీ అనేది 200 చదరపు అడుగుల లోపు ఉండే గదులను సులభంగా చల్లబరుస్తుంది.
ఇక మీ ఇంటికి సూర్యకాంతి ఎక్కువగా పడుతుంటే.. కిటికీలు పెద్దగా ఉండి నేరుగా ఇళ్లలోకి సూర్యకాంతి పడితే, పెద్ద సైజు పరిమాణంలో ఉండే ఏసీలు కొనుగోలు చేయడం మంచిది. అంటే మీ ఇంటికి 2 టన్ ఏసీ అవసరం. ఇక గోడలను సన్నగా ఉంటే త్వరగా వేడెక్కుతుంది. ఈ నేపథ్యంలో ఎక్కువ సామర్థ్యం ఉన్న ఏసీ కొనుగోలు చేయాలి. అయితే మీకు అవసరానికి మించి ఉపయోగించి ఏసీ కొనుగోలు చేస్తే అది విద్యుత్ బిల్లులు కూడా పెంచుతుంది. మీ గది అవసరాలను బట్టి మాత్రమే ఏసీలు కొనుగోలు చేయాలి. అవసరమైతే ఏసీ టెక్నీషియన్ పిలిపించి మీ గది పరమైన అన్ని కొలిపించి ఏసీలు కొనుగోలు చేయండి.
ఇక ఇప్పటి కాలంలో బాగా అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న ఏసీలు అందుబాటులో ఉన్నాయి. ఇన్వర్టర్ ఏసీలు కొనుగోలు చేస్తే మీ ఇల్లు త్వరగా చల్లగా అవడమే కాదు. కరెంట్ బిల్లు కూడా తక్కువగా వస్తుంది. ఇంకా 5 స్టార్ రేటింగ్ లో ఉండే ఏసీలను మాత్రమే కొనుగోలు చేయండి. ఇది కూడా బిల్లు ఖర్చు కాకుండా చేస్తుంది. ఇక 24 డిగ్రీలకు ఎక్కువ.. తక్కువ పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోండి. 24 డిగ్రీల ఉష్ణోగ్రత ఏసి మాత్రమే సెట్ చేయండి. స్లీప్ మోడ్ వంటి అదనపు ఫీచర్లు కూడా ఉంటాయి. ఒక రాత్రి సమయంలో ఆటోమేటిక్‌గా గది చల్లబడగానే అది స్లీప్ మోడ్ లోకి వెళ్తుంది. దీంతో మీకు నిద్ర కూడా భంగం వాటిల్లదు.