Motorola Edge 60 Stylus Launched: లాంచింగ్‌కు రెడీ.. మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్.. ఫీచర్స్ చూస్తే అవాక్కైపోతారు..!
Motorola Edge 60 Stylus Launched: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటరోలా తన కొత్త మిడ్-రేంజ్ ఫోన్ మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్‌ను భారతదేశంలో విడుదల చేసింది.

Motorola Edge 60 Stylus Launched: లాంచింగ్‌కు రెడీ.. మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్.. ఫీచర్స్ చూస్తే అవాక్కైపోతారు..!
Motorola Edge 60 Stylus Launched: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటరోలా తన కొత్త మిడ్-రేంజ్ ఫోన్ మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్‌ను భారతదేశంలో విడుదల చేసింది. దేశంలో దీని 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్ ధర రూ.22,999గా ఉంది. ఈ ఫోన్ పాంటోన్ జిబ్రాల్టర్ సీ,పాంటోన్ సర్ఫ్ ది వెబ్ అనే రెండు రంగుల్లో లభిస్తుంది. మొదటి సేల్ ఏప్రిల్ 23న మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్, మోటరోలా వెబ్‌సైట్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్స్‌లో ప్రారంభమవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Motorola Edge 60 Stylus Launch Offers
ఫ్లిప్‌కార్ట్‌లో రూ.1,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో, దీని ధర రూ.21,999 అవుతుంది. అదనంగా యాక్సిస్ బ్యాంక్, ఐడిఎఫ్‌సి బ్యాంక్ కార్డులపై రూ. 1,000 అదనపు తగ్గింపు లభిస్తుంది. రిలయన్స్ జియో వినియోగదారులు రూ. 2,000 క్యాష్‌బ్యాక్ , రూ. 8,000 వరకు విలువైన అదనపు ప్రయోజనాలు కూడా పొందచ్చు.
Motorola Edge 60 Stylus Display
ఈ ఫోన్‌లో 6.67-అంగుళాల 1.5K pOLED డిస్‌ప్లే ఉంది, ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. డిస్‌ప్లే 3,000 నిట్‌ల పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్‌ప్లే ఆక్వా టచ్, లో బ్లూలైట్ సర్టిఫికేషన్‌తో వస్తుంది. ఇది కళ్లపై తక్కువ ప్రభావాన్ని చూపుతుంది.
Motorola Edge 60 Stylus Software
మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ని 1TB వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత హలో UI పై రన్ అవుతుంది. కంపెనీ రెండు సంవత్సరాల పాటు ప్రధాన అప్‌డేట్స్, మూడు సంవత్సరాల పాటు భద్రతా అప్‌డేట్లను అందిస్తుంది.
Motorola Edge 60 Stylus Camera
ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది, ఇందులో 50MP సోనీ లైటియా 700C ప్రైమరీ సెన్సార్, 13MP అల్ట్రా-వైడ్ కెమెరా,3-ఇన్-1 లైట్ సెన్సార్ ఉన్నాయి. ముందు 32MP సెల్ఫీ కెమెరా ఉంది, ఇది వీడియో కాలింగ్, సెల్ఫీలకు చాలా బాగుంది.
Motorola Edge 60 Stylus Battery
ఈ ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ ఉంది, ఇది 68W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. దీనికి ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. కనెక్టివిటీ కోసం, 5G, 4G, Wi-Fi 6E, బ్లూటూత్ 5.4, జీపీఎస్, ఎన్ఎఫ్‌సి, USB టైప్-C పోర్ట్ వంటి అన్ని అవసరమైన ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.