Free JioHotstar: సవకే సవక.. జియో రూ.100 ప్లాన్.. ఉచితంగా జియో హాట్‌స్టార్..!
Free JioHotstar: భారత టెలికాం మార్కెట్‌లో రిలయన్స్ జియో మరోసారి సంచలనం సృష్టించింది

Free JioHotstar: సవకే సవక.. జియో రూ.100 ప్లాన్.. ఉచితంగా జియో హాట్‌స్టార్..!
Free Jiohotstar: భారత టెలికాం మార్కెట్‌లో రిలయన్స్ జియో మరోసారి సంచలనం సృష్టించింది. ఇటీవల ప్రవేశపెట్టిన రూ.100 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలను అందించేందుకు సిద్ధమైంది. ఈ ప్లాన్ 90 రోజుల ఉచిత జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 5GB హై-స్పీడ్ డేటాను ఆఫర్ చేస్తుంది.
ఇది స్మార్ట్‌ఫోన్, స్మార్ట్ టీవీలలో 1080p రిజల్యూషన్‌లో స్ట్రీమింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ప్లాన్ లో డేటా మాత్రమే లభిస్తుంది. ఈ రూ.100 ప్లాన్‌ను IPL 2025 క్రికెట్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని పరిచయం చేశారు. ఈ ప్లాన్‌తో, వినియోగదారులు జియో హాట్‌స్టార్ సినిమాలు, టీవీ షోలు, లైవ్ స్పోర్ట్స్ ఈవెంట్‌లను ఎంజాయ్ చేయచ్చు. 5GB డేటా స్ట్రీమింగ్, బ్రౌజింగ్ రెండింటి కోసం ఉత్తమంగా ఉంటుంది. డేటా లిమిట్ ముగిసిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 64 kbpsకి పడిపోతుంది. ఈ ప్లాన్‌ను యాక్టివేట్ చేయడానికి తప్పనిసరిగా ఒక బేస్ ప్లాన్‌తో సిద్ధంగా ఉండాలి.
జియో 90 రోజుల వాలిడిటీతో రూ.195 క్రికెట్ డేటా ప్యాక్ కూడా 15GB డేటాతో వస్తుంది. ఇందులో జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది, కానీ ఇది స్మార్ట్‌ఫోన్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రూ.100 ప్లాన్ తో స్మార్ట్ టీవీలలో కూడా స్ట్రీమింగ్ చేయచ్చు. ఈ ప్లాన్‌ను మైజియో యాప్, జియో వెబ్‌సైట్ లేదా పేటీఎం, గూగుల్ పే వంటి ప్లాట్‌ఫామ్‌ల నుంచి కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు.
ఐపీఎల్ 18వ సీజన్ 74 మ్యాచ్‌ల్లో ఇప్పటికే 44 పూర్తయ్యాయి. ఇవాళ ఆదివారం ఏప్రిల్ 27న మధ్యాహ్నం 3.30కి ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత రాత్రి 7.30కి ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి.