Motorola Edge 60 Stylus: బడ్జెట్ కింగ్.. మోటో నుంచి ఎడ్జ్ 60 స్టైలస్ స్మార్ట్‌ఫోన్.. రేపే లాంచ్..!

Motorola Edge 60 Stylus: మోటరోలా తన కొత్త మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో భారతదేశంలో విడుదల చేయనుంది.

Update: 2025-04-14 09:19 GMT
Motorola Edge 60 Stylus Launch In April 15 in India price features all details

Motorola Edge 60 Stylus: బడ్జెట్ కింగ్.. మోటో నుంచి ఎడ్జ్ 60 స్టైలస్ స్మార్ట్‌ఫోన్.. రేపే లాంచ్..!

  • whatsapp icon

Motorola Edge 60 Stylus: మోటరోలా తన కొత్త మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో భారతదేశంలో విడుదల చేయనుంది. కంపెనీ ఇటీవలే దేశంలో మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్‌ను విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్‌ను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఏప్రిల్ 15, 2025 మధ్యాహ్నం 12:00 గంటలకు విడుదల కానుందని ధృవీకరించింది. దీనితో పాటు, వారి అధికారిక ట్విట్టర్ ఖాతాలో దీని గురించి ఒక పోస్ట్ కూడా చేసింది. కాబట్టి, మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్ స్మార్ట్‌ఫోన్ అంచనా ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

Motorola Edge 60 Stylus Price

మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్‌కి వస్తుంది. దేశంలో తన ఫోన్‌లను ఆన్‌లైన్‌లో విక్రయించడానికి ఆ కంపెనీకి ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఆన్‌లైన్‌లో కొన్ని లీక్‌ల ప్రకారం.. మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్ భారతదేశంలో 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో రూ.22,999కి లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

Motorola Edge 60 Stylus Features And Specifications

ప్రస్తుతం ఆన్‌లైన్‌ ఉన్న లీక్స్ ప్రకారం.. ఈ ఫోన్ 1.5K 2.5D pOLED డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ సపోర్ట్‌తో రావచ్చని సూచిస్తున్నాయి. 3000నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, ఆక్వా టచ్ సపోర్ట్‌తో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌ను కూడా ఉంది. మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్ ఫోన్ 8జీబీ ర్యామ్, 256జీబీ UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్‌తో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుందని భావిస్తున్నారు.

మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు పెంచుకోవచ్చు. ఈ మొబైల్ వెనుక భాగంలో ట్రిపుల్-కెమెరా సెటప్‌తో 50MP సోనీ లైటియా 700C ప్రైమరీ సెన్సార్, మరో 13MP అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్, డెడికేటెడ్ 3-ఇన్-1 లైట్ సెన్సార్‌తో వచ్చే అవకాశం ఉంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 32MP సెన్సార్ ఉండే అవకాశం ఉంది. బ్యాటరీ విభాగంలో, మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్ ఫోన్ 68W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది.

Tags:    

Similar News